Mahesh Babu : బీబీపేట్ స్కూల్.. కేటీఆర్ ప్రశంసలు.. శ్రీమంతుడు టీమ్‌తో వస్తానన్న మహేష్ బాబు

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో జెడ్పీ హైస్కూల్ పై టాలీవుడ్ హీరో మహేష్ బాబు స్పందించారు. ప్రభుత్వ పాఠశాల అధునికీకరణ గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. శ్రీమంతుడు

Mahesh Babu : బీబీపేట్ స్కూల్.. కేటీఆర్ ప్రశంసలు.. శ్రీమంతుడు టీమ్‌తో వస్తానన్న మహేష్ బాబు

Mahesh Babu

Mahesh Babu : కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో జెడ్పీ హైస్కూల్ పై టాలీవుడ్ హీరో మహేష్ బాబు స్పందించారు. ప్రభుత్వ పాఠశాల అధునికీకరణ గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. శ్రీమంతుడు చిత్ర బృందంతో కలిసి స్కూల్ ని సందర్శిస్తానని చెప్పారు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కూల్ ను రూ.8కోట్లతో అభివృద్ధి చేయగా, మంత్రి కేటీఆర్ నిన్న ఈ స్కూల్ ని ప్రారంభిస్తూ ఫొటోలు ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ కు మహేష్ ఈ విధంగా స్పందించారు.

బీబీ పేట్ మండలంలోని జనగామ గ్రామంలో ఆధునికీకరణ చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రముఖ కాంట్రాక్టర్‌ సుభాష్‌ రెడ్డి తన సొంత డబ్బుతో జనగామలోని ప్రభుత్వ పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆధునీకరించారు. కార్పొరేట్‌ పాఠశాలను తలపించే విధంగా తీర్చిదిద్దిన నూతన పాఠశాల భవంతిని మంత్రులు ప్రారంభించారు.

WhatsApp: వాట్సప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. ఏంటో తెలుసా?

కోనాపూర్‌ ప్రాథమిక పాఠశాలను ఆధునిక హంగుల‌తో నిర్మిస్తామని, అలాగే జూనియర్ కాలేజీకి అనుమతి ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బీబీపేట్‌లో కోట్ల రూపాయలతో ఇంత చక్కటి పాఠశాలని నిర్మించిన దాత సుభాష్‌ రెడ్డి కుటుంబ సభ్యులకి ఆయన అభినందనలు తెలిపారు. పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ప్రశంసనీయమన్నారు.

సుభాష్ రెడ్డి అంత కాకపోయినా తాను కూడా పక్కనే ఉన్న తన నానమ్మ ఊరు కోనాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలను తాను బాగు చేయిస్తానని కేటీఆర్ మాటిచ్చారు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ పాఠశాల కట్టించారని ముందే తెలిస్తే.. మహేష్ బాబును తీసుకొచ్చే వాడిని అన్నారు. జూనియర్ కాలేజ్ కడుతున్నారు కదా? అది పూర్తయిన తర్వాత అప్పుడు మహేష్ బాబును తీసుకొద్దాం అన్నారు. ఆయన వస్తే ఇంకా పది మందికి ఈ విషయం తెలస్తుందని, ఇంకో పది చోట్ల ఇలాంటి మంచి పనులు జరుగుతాయని కేటీఆర్ అన్నారు.

Google Drive: గూగుల్ డ్రైవ్‌లో సరికొత్త ఫీచర్.. చిటికెలో మీ ఫైల్స్‌ గుర్తుపట్టొచ్చు!

శ్రీమంతుడు సినిమా చూసి ఇలా స్ఫూర్తి పొందడటం, కేటీఆర్ తన గురించి ప్రస్తావించడంతో మహేష్ బాబు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోందన్నారు. ”సుభాష్ రెడ్డి కి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో.. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక మేం అక్కడి వస్తాం” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

వ్యాపారవేత్త అయిన తిమ్మన గారి సుభాష్ రెడ్డి మార్గం ఫౌండేషన్ చీఫ్ గా ఉన్నారు. ఆయన బీబీపేట్ నివాసి. తన సొంత డబ్బుతో స్కూల్ బిల్డింగ్ నిర్మించారు. తన తల్లిదండ్రులు సుశీల, నారాయణ రెడ్డి జ్ఞాపకంగా సుభాష్ రెడ్డి ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చారు.

ఎంపీ బీబీ పాటిల్ రూ.11లక్షలు విరాళం ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ రూ.3 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ భవనంలో 32 క్లాస్ రూమ్ లు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ సౌండ్ సిస్టమ్, డైనింగ్ హాళ్లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.