Telangana Formation Day 2023: జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ర్యాలీలు.. ఇంకా

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కలవడం మంచి పరిణామమని చెప్పారు.

Telangana Formation Day 2023 – Congress: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ(Telangana)లోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ర్యాలీలు నిర్వహించనుంది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ కోసం కాంగ్రెస్ కమిటీ వేయనుందని మహేశ్ అన్నారు. జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు చేపట్టాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జూన్ 2న హైదరాబాద్ అమరవీరుల స్థూపం నుండి గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు.

తెలంగాణ ఎవరివల్ల వచ్చిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎలా మోసపోయిందో ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ కోసం కష్టపడ్డ ఎంపీలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు జూన్ 2న గాంధీ భవన్ లో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

తెలంగాణ ఇచ్చిన స్వప్నం సాకారం కాలేదని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నలిగిపోయిందని అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిన వారు కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారని చెప్పారు.

బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కలవడం మంచి పరిణామమని చెప్పారు. సెక్యులర్ పార్టీలు ఎవరైనా కాంగ్రెస్ నేతలను కలవచ్చని తెలిపారు.

DK Shivakumar – YS Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ.. తెలంగాణలో పొత్తులకు సంకేతమా..?

ట్రెండింగ్ వార్తలు