MIM Corporator: పోలీసులపై రెచ్చిపోయిన మరో మజ్లిస్ కార్పొరేటర్.. మీకు ఇక్కడేం పనిఅంటూ ఆగ్రహం

పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ అరెస్ట్ ఘటన మరవకముందే పాతబస్తీలో మరో మజ్లిస్ కార్పొరేటర్ రెచ్చిపోయాడు. అసలు మీకు ఇక్కడ ఏం పని, ఎందుకొచ్చారంటూ ...

MIM Corporator: పోలీసులపై రెచ్చిపోయిన మరో మజ్లిస్ కార్పొరేటర్.. మీకు ఇక్కడేం పనిఅంటూ ఆగ్రహం

Police

MIM Corporator:  పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ అరెస్ట్ ఘటన మరవకముందే పాతబస్తీలో మరో మజ్లిస్ కార్పొరేటర్ రెచ్చిపోయాడు. అసలు మీకు ఇక్కడ ఏం పని, ఎందుకొచ్చారంటూ ఎస్ఐపై చిందులేశాడు. ఈ ఘటన పాతబస్తీలోని మక్కా మసీదు దగ్గర చోటు చేసుకుంది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లీంలు మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రార్థనల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు అక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలకోసం వచ్చారు. వారికి వాహనాలు పార్కింగ్ చేసుకొనేందుకు యానాని హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ దఫా అలాంటి ఏర్పాట్లు చేయలేదు.

MIM Corporator Arrest : భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్ అరెస్ట్‌

వాహనాలు పార్కింగ్ చేసుకుందామంటే ఆస్పత్రి గేట్లు మూసివేశారు. దీంతో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలు రహదారిపైనే వాహనాలను పార్కింగ్ చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న మజ్లిస్ కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి  అక్కడికి వచ్చి పార్కింగ్ కోసం యానామి ఆస్పత్రి గేట్లు తెపిరించాడు. అదే సమయంలో ట్రాఫిక్ జామ్ అయిందన్న సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ, పోలీసులు అక్కడి చేరుకున్నారు. దీంతో మీరెందుకు వచ్చారు.. మీకు ఇక్కడ ఏం పని అంటూ ఎస్ఐపై మజ్లిస్ కార్పొరేటర్ మండిపడ్డాడు. ట్రాఫిక్ జామ్ అయిందని ఫోన్ రావడంతో వచ్చామని పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

హైదరాబాద్‌లో రోహింగ్యాలు : ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..అడ్డుకున్నMIM నేత

పోలీసుల పవర్ చూపిస్తామంటే ఇక్కడ నడవదు అంటూ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చేంత పనిచేశాడు. కొద్దిసేపు వాగ్వివాదం అనంతరం పోలీసులు అక్కడినుండి వెనుదిరిగిపోయారు. ఇదిలా ఉంటే భోలక్ పూర్ కార్పొరేటర్ అరెస్ట్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. రేవ్ పార్టీ రిచ్ కిడ్స్ ను వదిలేశారని, చట్టం పేద, ధనిక వర్గాలకు ఒకేలా వర్తించాలంటూ కామెంట్ చేస్తూ హైదరాబాద్ పోలీస్, మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.