Mallanna Sagar‌ : మల్లన్న సాగర్‌ నిర్వాసితులు సామూహిక ఆత్మహత్యాయత్నం

పునరావాస కల్పనలో భాగంగా నిర్వాసితులకు రావాల్సిన ఇంటి స్థలాల కేటాయింపుల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఎక్కడ స్థలం ఇస్తే.. అక్కడ తీసుకోవాలని లేదంటే అసలు స్థలం ఇచ్చేదే లేదని సర్పంచ్‌ బెదిరిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

Mallanna Sagar‌ : మల్లన్న సాగర్‌ నిర్వాసితులు సామూహిక ఆత్మహత్యాయత్నం

Mallanna Sagar

Mallanna Sagar‌ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులు సామూహిక ఆత్మహత్యకు పూనుకోవడం కలకలం రేపుతోంది. పునరావాస కల్పనలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో బంజరుపల్లి ఒకటి. ప్రభుత్వం ఈ గ్రామస్తులకు కూడా ప్యాకేజీ ప్రకటించింది. అయితే గ్రామానికి చెందిన మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు ప్యాకేజీలు రాకుండా సర్పంచ్‌ అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పునరావాస కల్పనలో భాగంగా నిర్వాసితులకు రావాల్సిన ఇంటి స్థలాల కేటాయింపుల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఎక్కడ స్థలం ఇస్తే.. అక్కడ తీసుకోవాలని లేదంటే అసలు స్థలం ఇచ్చేదే లేదని సర్పంచ్‌ బెదిరిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో సర్పంచ్‌ దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు తెలిపారు. లంచం ఇచ్చిన వారికే స్థలం కేటాయించారని ఆరోపించారు.

CM KCR : మల్లన్న సాగర్ జాతికి అంకితం.. తెలంగాణకు కరువు రాదన్న సీఎం కేసీఆర్

తాము డబ్బులు చెల్లించలేదని స్థలం ఇవ్వడం లేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో కొంతమంది నిర్వాసితులు బిల్డింగ్‌ ఎక్కి నిరసన తెలిపారు. సామూహిక ఆత్మహత్యకు పూనుకొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. నిర్వాసితుల డిమాండ్స్‌పై చర్చించారు. న్యాయం చేస్తామని హమీనిచ్చారు. మొత్తానికి అధికారుల జోక్యంతో గొడవ సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది.