T.Congress : సీఎం కేసీఆర్‌‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ, మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి

T.Congress :  సీఎం కేసీఆర్‌‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ, మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి

Mallu Bhatti Vikramarka Speaking To Media After Meeting Cm Kcr

Mallu Bhatti Vikramarka : మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను తాము కోరడం జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు, బాధ్యులైన అధికారులతో పాటు..మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆమె కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. కుటుంబానికి పరిహారం ఇవ్వాలని చెప్పామన్నారు. జరిగిన సంఘటన గురించి పూర్తిగా చెప్పామన్నారు మల్లు.

2021, జూన్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం టి.కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. భేటీ అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాజకీయ అంశాలపై తాము మాట్లాడ లేదని, బీజేపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. మరియమ్మ..దళిత కుటుంబానికి చెందిన మరియమ్మ మహిళ పోలీసు లాకప్ లో దారుణంగా దెబ్బతిని చనిపోయిన వైనం, కొడుకుపై జరిగిన దాడి.. అత్యంత పాశవికంగా ఉందన్నారు.

దళితులపై దాడులు పెరిగిపోయాయని, వీరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని..ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సీఎల్పీ పక్షాన వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే..సీఎం కేసీఆర్ ను కలిసినట్లు చెప్పారు. సంబంధిత అధికారులను అక్కడకు పిలిపించి..సమగ్ర విచారణ జరిపించి..కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారని తెలిపారు. మరియమ్మ కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఉదయ్ కిరణ్ కు రూ. 15 లక్షలు..మరియమ్మ కూతుళ్లకు తలా రూ. 10 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారని వెల్లడించారు. మరియమ్మ కుటుంబానికి ఒక ఇళ్లు మంజూరు చేయాలని కోరితే..దీనికి సీఎం అంగీకరించారన్నారు. జూన్ 28వ తేదీలోపు ఇవన్నీ చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు మల్లు భట్టి విక్రమార్క.