Telangana Congress : టి.కాంగ్రెస్‌‌లో ఏమి జరుగుతోంది, ఢిల్లీకి వెళ్లిన భట్టి

కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడం.. హుటాహుటిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ విమానం ఎక్కడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. టీపీసీసీ కొత్త చీఫ్‌ నియామకం కాంగ్రెస్‌లో సెగలు పుట్టిస్తుండటంతో.. హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది.

Telangana Congress : టి.కాంగ్రెస్‌‌లో ఏమి జరుగుతోంది, ఢిల్లీకి వెళ్లిన భట్టి

Mallu Bhatti Vikramarka : కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడం.. హుటాహుటిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ విమానం ఎక్కడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. టీపీసీసీ కొత్త చీఫ్‌ నియామకం కాంగ్రెస్‌లో సెగలు పుట్టిస్తుండటంతో.. హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక తరువాత కాంగ్రెస్‌లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది.

రేవంత్ రెడ్డిని హైకమాండ్ టీపీసీసీ చీఫ్‌గా నియమించడంపై కొందరు సీనియర్లు తీవ్రస్థాయిలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు సీనియర్లు ఈ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించకపోయినప్పటికీ.. రేవంత్ రెడ్డికి మద్దతు తెలపకుండా మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో వారి ఆలోచన ఏమిటనేది ఎవరికీ అర్థంకావడం లేదు. అయితే ఈ లిస్ట్‌లోనే ఉన్నారు బట్టి విక్రమార్క. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపికపై భట్టి మౌనంగా ఉన్నారు.

దీనికి తోడు రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్న హైకమాండ్‌.. ఢిల్లీ రావాలంటూ భట్టికి కబురుపంపింది. దీంతో.. ఢిల్లీ విమానం ఎక్కారు భట్టి విక్రమార్క. ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో భట్టి ఎవరిని కలుస్తారు..? వాళ్లు ఆయనకు ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిచి అధిష్టానం బుజ్జగిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి భట్టి విక్రమార్క ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎలా వ్యవహరిస్తారనే అంశాన్ని బట్టే.. ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు హస్తినకు పిలిచిందనే విషయం తెలుస్తుందంటున్నాయి గాంధీభవన్‌ వర్గాలు.