Custome Care : కస్టమర్ కేర్‌కి ఫోన్ చేశాడు, రూ.79వేలు పొగొట్టుకున్నాడు

ఆన్ లైన్ లో ఏవైనా కాంటాక్ట్ నెంబర్లు వెతికే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ లో

Custome Care : కస్టమర్ కేర్‌కి ఫోన్ చేశాడు, రూ.79వేలు పొగొట్టుకున్నాడు

Customer Care

man calls customer care: ఆన్ లైన్ లో ఏవైనా కాంటాక్ట్ నెంబర్లు వెతికే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ లో సెర్చ్ చేసి ఏ నెంబర్ దొరికితే దానికి కాల్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోతప్పదని వార్నింగ్ ఇచ్చారు. దీని గురించి చైతన్యం కల్పించారు. గతంలో ఈ తరహాలో అనేక మోసాలు జరిగాయి. తాజాగా అలాంటి చీటింగ్ మరొకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఆన్ లైన్ లో సెర్చ్ చేసి కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేశాడు. అంతే రూ.79వేలు పొగొట్టుకున్నాడు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ జవహర్‌కాలనీకి చెందిన తాళ రెడ్డి ప్రకాశ్‌ మే 30న షాప్‌ మై మొబైల్స్‌లో ఓ ఫోన్‌ అర్డర్‌ చేశాడు. క్రెడిట్‌ కార్డు నుంచి రూ.4,499 చెల్లించాడు. రెండు రోజులు తర్వాత అతడికి ఫోన్‌ వచ్చింది. తాను అర్డర్‌ చేసింది కాకుండా మరో ఫోన్‌ రావడంతో కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశాడు. సరిగా వినిపించకపోవడంతో ఫోన్‌ కాల్‌ కట్‌ చేశాడు. కాసేపటికి కస్టమర్‌ కేర్‌ ఉద్యోగిని అంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు.

ఫోన్‌ తప్పుగా వచ్చిందని ప్రకాశ్‌ చెప్పగా డబ్బు వెనక్కి ఇస్తామని చెప్పి క్రెడిట్ కార్డు వివరాలు తీసుకున్నాడు. కార్డు వివరాలు రావడం లేదని చెప్పి బ్యాంకు ఖాతా వివరాలు కూడా తీసుకున్నాడు. కాసేపటి తర్వాత డబ్బు ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆ కాసేపటికి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 59 వేలు, బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.20 వేలు డ్రా అయ్యాయి. దీంతో ప్రకాశ్ కంగుతిన్నాడు. ఆ నెంబర్ కి తిరిగి ఫోన్‌ చేస్తే.. అది పని చేయలేదు. తాను మోసపోయానని తెలుసుకుని ప్రకాశ్ లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.