Telangana Assembly డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని..తెలంగాణ అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Telangana Assembly  డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని..తెలంగాణ అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ad

suicide attempt : తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న అసెంబ్లీ సిబ్బంది అడ్డుకుని, అతన్ని రక్షించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో కూడా తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బందోబస్తులో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ హైకోర్టు దగ్గర మహిళ ఆత్మహత్యాయత్నం

తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరుగలేదని ఆరుచుకుంటూ అతడు పెట్రోల్ పోసుకున్నాడు. జై తెలంగాణ అంటూ నినదించడమే కాకుండా… కేసీఆర్ సర్ న్యాయం చేయమని బాధితుడు అరిచాడు. ఇవాళ మరో వ్యక్తి అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది.