Khammam : ఊరుకాని ఊరులో ఆ నలుగురే తోడు..స్నేహితుడి శవాన్ని రిక్షాలో….
తెలుగు సినిమాలో ఒక డైలాగు ఉంది... డబ్బు లేకుంటే ఈదేశంలో చావు కూడా ప్రశాంతంగా సాగదని... అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసంఘటనలు చూసినప్పుడు.

Khammam : తెలుగు సినిమాలో ఒక డైలాగు ఉంది… డబ్బు లేకుంటే ఈదేశంలో చావు కూడా ప్రశాంతంగా సాగదని… అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసంఘటనలు చూసినప్పుడు. మన చుట్టు పక్కల వారికి ఎంత కష్టం వచ్చినా అయ్యో అని వదిలేస్తామే తప్ప సాయం చేయటానికి ఎవరూ ముందుకు రాని పరిస్ధితులు ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులలో మరణించిన మృతదేహాలను తరలించటానికి కూడా అంబులెన్స్ డ్రైవర్లు ఎలా ప్రవర్తించారో ఎంతెంత డబ్బులు డిమాండ్ చేశారో ఇటీవలి కాలంలో మనం చూశాము. తాజాగా ఖమ్మంలో ఒకవ్యక్తి రైల్వే స్టేషన్లో చనిపోతే అతడి శవాన్ని తరలించటానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవటం శోచనీయం. చివరికి అతని మిత్రులు రిక్షామీద తీసుకుని శవాన్ని మార్చురీకి తరలించారు.
వివరాలలోకి వెళితే….ఉత్తరప్రదేశ్‌లోని కన్నోజ్ జిల్లా ధ్యాస్పూర్ గ్రామానికి చెందిన ములకరాజ్(37) అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు స్నేహితులతో కలిసి జీవనోపాధి కోసం కొన్నాళ్ళ క్రితం తెలంగాణలోని సూర్యాపేటకు వచ్చి ఐస్ క్రీం వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేట సమీపంలోని అయిటిపాముల వద్ద ఐస్ క్రీం విక్రయిస్తుండగా ద్విచక్ర వాహానం వచ్చి ములకరాజ్‌ను ఢీ కొట్టింది.
గాయపడిన అతడిని స్నేహితులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేయించిన తర్వాత వారు అక్కడ నుంచి సూర్యాపేటకు పంపించారు. వైద్యులు అతడిని పరీక్షించి … పరిస్ధితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. హైదరాబాద్ తీసుకువెళ్లి వైద్యం చేయించే ఆర్ధిక స్ధోమత లేని స్నేహితులు సొంతూరుకు వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయారు.
అందుకోసం రైలు ఎక్కేందుకు స్నేహితులు ఐదుగురు మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్నాక బాగానే ఉన్న ములకరాజ్ విశ్రాంతి కోసం ప్లాట్ ఫాంపై పడుకున్నాడు. అలా నిద్రపోతూనే ములకరాజ్ తుదిశ్వాస విడిచాడు. స్నేహితుడు మరణించాడనే విషయం తెలుసుకున్నస్నేహితులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్లాట్ ఫాం నుంచి మార్చురీకి తరలించాలని ఆదేశించారు.
స్నేహితులు రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆటోవాలాలను, ప్రైవేట్ వాహనాలను అడిగితే వారు 5 వేల రూపాయలు అడిగారు. అంత డబ్బు ఇచ్చుకోలేని స్నేహితులు చివరకు ఒకరిక్షా కార్మికుడికి 500 రూపాయలు ఇచ్చి తమ మిత్రుడు మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని మండు టెండలోనడుచుకుంటూ ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read : National Herald Case : మూడోరోజూ విచారణకు హాజరు కానున్న రాహుల్ గాంధి
- Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు
- Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ ఆఫీసులో మృతదేహం..
- Puvvada Ajay Kumar: అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి.. వై.ఎస్.షర్మిలపై పువ్వాడ ఫైర్
- Minister KTR : ఖమ్మం టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ క్లాస్
- నకిలీలపై పోలీసుల నిఘా
1Dangerous bacteria: హిమాలయాల మంచు కింద వందలాది డేంజరస్ బ్యాక్టీరియాలు..అవి బయటపడితే..కరోనాను మించిన కల్లోలమే..
2Sreemukhi: యూఎస్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తోన్న శ్రీముఖి
3BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
4India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
5JOBS : ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాల భర్తీ
6IndVsEng 5th Test : సెంచరీతో కదంతొక్కిన జడేజా, బుమ్రా సంచలన బ్యాటింగ్.. భారత్ భారీ స్కోర్
7Punjab govt free power : పంజాబ్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన..నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఫ్రీ
8Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
9Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
10JOBS : వరంగల్ నీట్ లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?
-
Coffee Powder : కాఫీ పొడితో ప్రయోజనాలు ఎన్నో!
-
Revanth Reddy : టీఆర్ఎస్, బీజేపీవి చిల్లర రాజకీయాలు : రేవంత్ రెడ్డి
-
MS Dhoni : ఎంఎస్ ధోనీకి ఏమైంది. రూ.40లతో నాటు వైద్యం..!
-
Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?
-
PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
-
Jamun Fruits : మెదడు, గుండెకు ఔషధంగా పనిచేసే నేరేడు పండ్లు!