గుండెపోటుతో మృతి చెందిన అన్న మరణం తట్టుకోలేక తమ్ముడు కూడా మృతి

  • Published By: nagamani ,Published On : July 1, 2020 / 11:10 AM IST
గుండెపోటుతో మృతి చెందిన అన్న మరణం తట్టుకోలేక తమ్ముడు కూడా మృతి

గుండెపోటుతో మరణించిన అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతిలో చోటుచేసుకుంది. సిద్ధాంతికి చెందిన 55 ఏళ్ల రాచమల్ల సుదర్శన్‌ జీహెచ్ఎంసీలో స్విమ్మింగ్‌ కోచ్‌గా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా జూన్ 29న వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుండగా సుదర్శన్ అస్వస్థతకు గురయ్యారు. అప్పటికే గతంలో సుదర్శన్ కు ఓ సారి గుండెపోటు రావడంతో ఆపరేషన్‌ చేయించుకున్నాడు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన రాత్రి మరోసారి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

అన్నమరణం తట్టుకోలేక కుప్పకూలి చనిపోయిన తమ్ముడు లవణ్
ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న 32 ఏళ్ల సుదర్శన్ తమ్ముడు లవణ్‌కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు.  వెంటనే  ఇంటికి చేరుకుని అన్న మృతదేహాన్ని చూసి లవణ్ తల్లడిల్లిపోయాడు. అమ్మానాన్నలు మరణించిన తర్వాత అన్నీ తానై అండగా ఉన్న అన్న చనిపోయాడనే వార్తను భరించలేకపోయాడు. అన్న మృతదేహంపై పడి భోరున విలపించాడు. అతడి ఆవేదనను చూసినవాంత కన్నీరు పెట్టుకున్నారు. రామలక్ష్మణుల్లా ఉండేవారు…అన్న మరణంతో తల్లడిల్లిపోతూ విలపిస్తున్న లవణ్  ను ఓదార్చారు. కానీ లవణ్ అన్న మరణాన్ని  జీర్ణించుకోలేకపోయిన తమ్ముడు భోరున ఏడుస్తూనే కుప్పకూలిపోయాడు.

తీవ్ర విషాదంలో కుటుంబం..స్థానికులు
అలా కప్పకూలిన లవణ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. రామలక్ష్మణుల్లా ఉండే కలిసి మెలిసి ఉండే అన్నదమ్ములిద్దరూ ఒకే సారి మరణించడంతో ఆ కుటుంబంతో పాటు స్థానికులంతా తీవ్ర షాక్ కు గురయ్యారు. ఇక సుదర్శన్ కుటుంబం రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. సుదర్శన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లవణ్‌కు వివాహం కాలేదు. ఇద్దరినీ ఒకేసారి కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Read:తెలంగాణ నేతలకు కరోనా.. జాగ్రత్త చర్యలు సరేనా.. ఇళ్లలోనే ప్రజాప్రతినిధులు