Call Girl: అప్పు అడుగుతోందని కాల్ గర్ల్ అంటూ ఆమె ఫోన్ నంబర్‌ను షేర్ చాట్‌లో పెట్టేశాడు

Call Girl: అప్పు అడుగుతోందని కాల్ గర్ల్ అంటూ ఆమె ఫోన్ నంబర్‌ను షేర్ చాట్‌లో పెట్టేశాడు

Call Girl

Call Girl: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్‌ను షేర్ చాట్‌లో కాల్ గర్ల్ అంటూ పెట్టేశాడు వ్యక్తి.. రాచకొండ సైబర్ క్రైమ్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్‌ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు.

డబ్బు వెంటనే ఇస్తానని తీసుకున్న యశ్వంత్ చాలా రోజులవరకు ఇవ్వలేదు. దీంతో డబ్బు ఇచ్చిన వారు అనేక సార్లు కాల్ చేసి అడిగారు. యశ్వంత్ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో వారి తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో యశ్వంత్ ను అతడి తల్లిదండ్రులు మందలించారు.

తల్లిదండ్రులకు చెప్పారన్న విషయాన్నీ మనసులో పెట్టుకున్న యశ్వంత్ బాధితురాలిపై ఆమె భర్తపై పగ పెంచుకున్నాడు. వారి పరువు తియ్యాలని షేర్ చాట్‌లో బాధితురాలి ఫోన్ నంబర్ పెట్టి కాల్ గర్ల్ అంటూ పోస్ట్ చేశాడు.

కొన్నిరోజులుగా బాధితురాలికి ఫోన్లు రావడం.. ఫోన్ చేసిన వారు అసభ్యంగా మాట్లాడుతుండటంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.