Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలంలోని కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ పాఠశాలతోపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన 22 పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి.

Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద కేజీ టూ పీజీ ఉచిత విద్య అందేలా విద్యాసంస్థల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రారంభించారు.

#Budget2023: కేంద్ర బడ్జెట్-2023లోని 7 లక్ష్యాలు.. సప్తర్షిగా వర్ణించిన ఆర్థికమంత్రి నిర్మల

మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలంలోని కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ పాఠశాలతోపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన 22 పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ఈ విద్యా సంవత్సరం మండలానికి రెండు చొప్పున మొత్తం 1210 పాఠశాలల్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 680 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. వీటిని ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం తెలంగాణవ్యాప్తంగా 9,123 పాఠశాలల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో రూ.3,497 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

#UnionBudget 2023 : బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది..ఎన్నో ప్రోత్సాహాలు ప్రకటించాం : ప్రధాని మోడీ

ఈ నిధుల ద్వారా పాఠశాలల్లో 12 రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. గత ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి కొన్ని పాఠశాలల్లోనే ఏర్పాట్లు పూర్తికాగా, మరికొన్నింటిలో త్వరలో పూర్తవుతాయి. వాటిని కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రారంభమైంది తెలంగాణలోని తొలి కేజీ టూ పీజీ క్యాంపస్. దాదాపు రూ.3 కోట్లతో ఇది ఏర్పాటైంది. ఆరు ఎకరాల్లో నిర్మించిన ఈ క్యాంపస్ పరిధిలో మొత్తం 70 తరగతి గదులున్నాయి. ఆధునిక సౌకర్యాలతో ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దారు.

ఇక్కడ 3,500 మంది వరకు విద్యార్థులు చదువుకునేందుకు వీలుంది. డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌తోపాటు ఒకేసారి 1,000 మంది భోజనం చేసేలా భారీ డైనింగ్ హాల్ ఇక్కడ ఏర్పాటైంది. ప్రీ ప్రైమరీ నుంచి, ప్రైమరీ, అప్పర్ స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ వంటివి ఇక్కడ ఉంటాయి.