Maniac attack: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది

తన ప్రేమను కాదన్నది అనే కోపంతో యువతి గొంతు కోసేశాడు ఓ ఉన్మాది.

Maniac attack: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది

Attack

Maniac attack: తన ప్రేమను కాదన్నది అనే కోపంతో యువతి గొంతు కోసేశాడు ఓ ఉన్మాది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వట్టి నాగులపల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

ప్రేమ సింగ్ అనే యువ ఉన్మాది.. యువతి ఇంట్లోకి చొరబడి గొంతు, చేతులు, కాలు మని కట్టు కోశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో బంధువులు, స్థానికులు యువకుడిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేమ్ సింగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, యువతి స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తుంది. కాంటినెంటల్‌ ఆసుపత్రిలో యువతి చికిత్స పొందుతుంది. స్థానికుల దాడిలో ప్రేమ్ సింగ్‌ కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే తాగిన మైకంలో హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. వీరిద్దరూ బంధువులేనని పోలీసులు గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.