Corona Vaccine : నిమ్స్ లో వ్యాక్సిన్ పంపిణీ..అవకతవకలు, అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ

నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

Corona Vaccine : నిమ్స్ లో వ్యాక్సిన్ పంపిణీ..అవకతవకలు, అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ

Nims

NIMS : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమ క్రమంగా తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సర్కార్..వ్యాక్సినేషన్ ప్రక్రియను జోరుగా కొనసాగిస్తున్నారు. 2021, మే 28వ తేదీ శనివారం నుంచి సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే..వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి.

నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ వేల మందికి ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత సర్టిఫికెట్స్ రాలేదు. ఇప్పుడు వారి రెండో డోస్‌పై అమోమయం నెలకొంది. మరోవైపు వ్యాక్సిన్ అవకతవకలపై నిమ్స్‌లో అంతర్గత విచారణ పూర్తైంది. డైరెక్టర్ ఆదేశాలతో మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ విచారణ చేపట్టారు.

అప్పటి వ్యాక్సిన్ ఇంచార్జ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండ్ కృష్ణారెడ్డి.. వివరణ ఇచ్చారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పినట్లు తెలుస్తోంది. ఐడీ, ఆధార్ పరిశీలించకుండా వ్యాక్సిన్ ఎలా ఇచ్చారని అధికారులు నిలదీశారు. మార్చి, ఏప్రిల్ నెలలో వ్యాక్సిన్ వివరాలు ఎందుకు ఆన్‌లైన్ చేయలేదని ప్రశ్నించారు. మూడు రోజుల్లోగా విజిలెన్స్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అధికారులు సమర్పించనున్నారు. నివేదిక తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడే ఛాన్స్ ఉంది.

Read More :  Khammam : అంబులెన్స్ లో తరలించే స్థోమత లేక..బైక్ పై డెడ్ బాడీ తరలింపు