మారుతీరావు మృతిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 02:43 PM IST
మారుతీరావు మృతిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..? ప్రణయ్ హత్య కేసులో శిక్ష తప్పదని ముందే ఊహించి అనర్ధాన్ని కొనితెచ్చుకున్నాడా..? కారణం ఏదైనా.. ఒక్క మరణం వంద సందేహాలను మిగిల్చింది. ఊహించినట్టుగానే మారుతీరావు అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆరోపణలు.. విమర్శనాస్త్రాలు.. కౌంటర్‌ ఎటాక్‌లు మొదలయ్యాయి. అందరి గురి మారుతీరావు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు, అంతకుమించిన అంతస్తులపైనే. ఇంతకీ మారుతీరావు సంపాదించింది ఎంత..? అవన్నీ ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి..? బినామీల గుట్టు తేలేదెలా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

అంతా శ్రవణే చేశాడు : అమృత 
ప్రణయ్ హత్య కేసులో పశ్చత్తాపంతో మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మొదట భావించింది అమృత. అయితే 24గంటలు గడిచేసరికి అభిప్రాయం మార్చేసుకుంది. అంతా శ్రవణే చేశాడని ఆనుమానం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని.. ఆ ఒత్తిడితోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బాంబు పేల్చింది. మారుతీరావు బినామీ కరీం అని కూడా మనసులో మాట బయటపెట్టింది. ప్రణయ్ హత్య కేసులో ఏ5గా ఉన్న కరీం..తనపై అమృత చేసిన బినామీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బినామీ ఆస్తులు నిరూపిస్తే పేదలకు ఇస్తానని చెప్పారు. మారుతీరావుపై శ్రవణ్ గతంలో చేయి చేసుకున్నాడని తెలిపారు. అమృత వ్యాఖ్యలపై మారుతీరావు సోదరుడు శ్రవణ్ మండిపడ్డారు. అమృతకు మారుతీరావు ఇన్నాళ్లకు గుర్తొచ్చాడా అని ప్రశ్నించారు. ఆస్తి కోసం అమృత కొత్త డ్రామా మొదలెట్టిందని ఆరోపించారు. 

‘మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు’
‘మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మా నాన్న మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్‌ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. మా నాన్న ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. ఆస్తి తగాదాలే ఆత్మహత్యకు కారణం కావచ్చు. వీలునామాలో బాబాయ్‌ (శ్రవణ్‌) పేరు ఉంటే అనుమానం​ వస్తుందని పేరు తీయించేసి ఉండాలి’ అని మారుతీరావు కుమార్తె అమృతా ప్రణయ్‌ తెలిపారు.

చనిపోవడానికి వేరే కారణాలు కూడా కావొచ్చు
అమృత సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే నాన్న ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. చనిపోవడానికి వేరే కారణాలు కూడా కావొచ్చు. ప్రణయ్‌ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవు. ఈ కేసులో చట్టపరంగా నాన్నకు శిక్ష పడాలని కోరుకున్నాను. వాళ‍్ల ఆస్తుల గురించి నాకు అవసరం లేదు. వాటి మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నేను బయటకు వచ్చాక వాళ్లు ఆస్తులు పంచుకున్నారు. ఆస్తి విషయంలో మా అమ్మకు బాబాయ్‌ నుంచి ప్రాణహాని ఉండచ్చొని నేను భావిస్తున్నాను. గతంలో పరువు విషయంలో మా నాన్నను బాబాయ్‌ చాలాసార్లు రెచ్చగొట్టాడు. ఇవాళ ఉదయం శ్మశానంలో నన్ను అడ్డుకోవడం సరికాదు. తండ్రి అని నేను చూడటానికి వెళ్ళాను..నన్ను చూడనివలేదు. నన్ను అడ్డుకుంది కూడా బాబాయ్‌ వాళ్ల అమ్మాయి. 

అందుకే మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను
పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. భర్త చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకే మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను. బాబు పుట్టాక అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. బాబును చూపించాలని కోరితే నేను నిరాకరించా. నేను అయితే ప్రణయ్‌ కుటుంబాన్ని వదిలి అమ్మ దగ్గరకు వెళ్లను. ఒకవేళ ఆమె నా దగ్గరకు వస్తే ఆమె బాధ్యత తీసుకుంటాను. నా భర్త ప్రణయ్‌ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో… ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నాను. ప్రాణం తీసినా, తీసుకున్నా అందరికీ బాధే’ అని అన్నారు.

అమృత ఆరోపణలను ఖండించిన శ్రవణ్‌ 
తనపై అమృత చేసిన ఆరోపణలను మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ ఖండించారు. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. శ్రవణ్‌ సోమవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘అమృత తీరు మమ్మల్ని ఎంతో బాధించింది. నేను మా అన్నయను బెదిరించానని ఆరోపిస్తోంది. నా వల్ల ప్రాణహాని ఉందనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక ప్రణయ్‌ హత్యకేసులో నా ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. 

అమృత విషయంలోనే గొడవలు 
మా అన్న మారుతీరావు చనిపోయే వరకూ ఉరి తీయాలని అమృత డిమాండ్‌ చేసింది. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. ప్రణయ్‌ హత్యకు ముందు మా అన్నకు నాకు మాటలు లేవు. అమృత విషయంలోనే గొడవలు జరిగాయి. ఆమె చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయి. తండ్రి చనిపోతే ఆమె వ్యవహరించిన తీరు సరిగా లేదు. తండ్రి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదు? నేను బెదిరించే వాడిని అయితే నా పేరు ఎందుకు బయటకు రాలేదు? మా అన్న చనిపోయాక ..అమృతకు ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చింది?

అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు
నాన్న అని పిలవడానికి కూడా అమృతకు మాట రావడం లేదు. మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్లీ ఇప్పుడు నా పై ఆరోపణలు చేస్తోంది. దయచేసి మీడియా కూడా అవాస్తవాలు రాయొద్దు. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఒకవేళ మా అన్న ఎవరికైనా అప్పు ఉంటే వాటిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు.