Covid Fear : కరోనా కాదు… భయం చంపేస్తోంది…కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వీ.రావు

Covid Fear : కరోనా కాదు… భయం చంపేస్తోంది…కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వీ.రావు

Many People Died Only Covid Fear Dr Mv Rao Comments

Covid Fear  : ప్రస్తుతం సమాజంలో కరోన వైరస్ కంటే భయంవల్లే ఎక్కవ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ల ఎంవీ రావు అభిప్రాయపడ్డారు. 10టీవీ లో ఈ రోజు “భయమే చంపేస్తోంది” అనే అంశంపై జరిగిన జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ

చాలామంది ఇళ్లలో కూర్చుని కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలు, భయానక వార్తల దృశ్యాలు….కరోనా వలన మరణించారనే వార్తల వల్ల సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి యాంగ్జయిటీ, డిప్రెషన్, కు లోనవుతున్నారు.జనంలో భయం నెలకొంది. దీనివల్ల నిద్రలేమి, ఆందోళన భయం విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా వచ్చి భయం వేసినప్పడు మనకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ విడుదలైనప్పుడు మన గుండె హార్ట్ బీట్ పెరుగుతుంది. బీపీ పెరుగుతుందని చెప్పారు. ప్రజలు టీవీలుపేపర్లు చూసి భయపడటం వల్లే వాళ్లకు ఒరిగేదేమి లేదు… ఆల్ రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్లు ఆ భయం వల్ల మరింతప్రమాదంలోకి నెట్టబడుతున్నారు.

వాస్తవానికి భయపడేవాళ్లంతా జాగ్రత్తలు పాటించటంలేదు. ప్రజలంతా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంటే కోవిడ్ సోకే అవకాశం తక్కువ అని చెప్పారు. అప్పటికీ ఒకవేళ కోవిడ్ సోకితే వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే మరణాన్నుంచి బయటపడవచ్చని ఆయన చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. ప్రజలు కరోనాకు భయపడకుండా… టీకా వేయించుకుని జాగ్రత్తలు పాటిస్తే క్షేమంగా ఉండోచ్చని సూచించారు. కేవలం భయం వల్ల ఇతర అనారోగ్యలక్షణాలువస్తాయి కాబట్టి ఎవరూ భయపడవద్దని ఆయన సూచించారు.