Prakasam: అప్పు తీరుస్తామని పిలిచి హతమార్చారు.. జిల్లేళ్లపాడు ఘటనలో నిందితుడు ఆచూకీకోసం పోలీసుల విస్తృత గాలింపు

నిందితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి, రాధ చిన్ననాటినుండి ఒకే పాఠశాలలో చదువుకున్న మిత్రులు. తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో రాధకు వివాహమైంది. ఆ తరువాత వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

Prakasam: అప్పు తీరుస్తామని పిలిచి హతమార్చారు.. జిల్లేళ్లపాడు ఘటనలో నిందితుడు ఆచూకీకోసం పోలీసుల విస్తృత గాలింపు

Radha Death case

Prakasam: ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేళ్లపాడులో దారుణం ఘటన చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తానని పిలిచిమరీ స్నేహితురాలిని దారుణంగా హత్య చేశాడు. స్నేహితుడి చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధ రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని నల్లగొండ జిల్లా కోదాడకు తరలించారు. కోదాడలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. రాధా హత్యకేసులో నిందితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి పరారీలో ఉండటంతో.. అతని ఆచూకీకోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

నిందితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి, రాధ చిన్ననాటినుండి ఒకే పాఠశాలలో చదువుకున్న మిత్రులు. తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో రాధకు వివాహమైంది. ఆ తరువాత వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాశిరెడ్డికూడా హైదరాబాద్ ఉద్యోగం చేస్తుండేవాడు. వీరిద్దరూ సాప్ట్ వేర్ ఇంజనీర్లు. కాశిరెడ్డి తనకొక ప్రాజెక్ట్ ఆలోచన ఉందని చెప్పి.. రాధా రెడ్డి కటుుంబం వద్ద రూ. 80లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చానాళ్లపాటు కాశిరెడ్డి తీను తీసుకున్న నగదును తిరిగి ఇవ్వకపోవటంతో రాధ, ఆమె భర్త కలిసి పలుసార్లు కాశిరెడ్డిని ప్రశ్నించారు. ఈ నెల 11న ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేళ్లపాడులో చౌడేశ్వరీ దేవి ఉత్సవంలో పాల్గొనేందుకు ఇద్దరు పిల్లలతో రాధ వెళ్లింది.

Shah Rukh Khan : ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి.. షారుఖ్ ఖాన్ నుంచి లంచం తీసుకున్నాడు!

స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డిని మరోసారి అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే, అప్పుగా తీసుకున్న డబ్బుల్లో కొంత చెల్లిస్తానని, తాను చెప్పిన ప్రాంతానికి వెళితే తమ వ్యక్తులు డబ్బు ఇస్తారంటూ కేతిరెడ్డి కాశిరెడ్డి నమ్మకంగా చెప్పాడు. దీంతో తన చిన్న కుమారున్ని తీసుకొని కనిగిరికి రాధ వెళ్లింది. కనిగిరిలోని తన చిన్ననాన్న నాగిరెడ్డి వద్ద తన చిన్న కుమారుడిని వదిలింది. అక్కడి నుంచి అజ్ఞాత వ్యక్తికి రాధ ఫోన్ చేయడంతో పామూరు బస్టాండ్ వద్దకు రావాలని చెప్పడంతో బాబాయ్ నివాసం నుండి డబ్బుకోసమని రాధా వెళ్లిపోయింది. వెళ్లిన రెండు గంట వ్యవధిలోనే విగత జీవిగా మారింది.

Uttar Pradesh : కొత్త పెళ్లికొడుకు నిర్వాకం..హనీమూన్ కోసం రూ.10 లక్షలు తేలేదని భార్య అసభ్యకర ఫొటోలతో బెదిరింపులు!

రాధను అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేశారనేది పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడింది. ఆమె కాళ్లపైనా, ఛాతిపైనా కారుతో తొక్కించి అత్యంత ఘోరంగా హింసించిన ఆనవాళ్లను గుర్తించారు. ఈ హత్య ఘటనలో ముగ్గురు, నలుగురు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, రాధ పోస్టుమార్టం వివరాలు వస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితుడు కాశిరెడ్డి ఆచూకీకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విస్తృత గాలింపు చర్యలు చేపట్టిన ఎస్పీ మలిక గర్గ్ తెలిపారు.