Masks : మాస్కే శ్రీరామరక్ష..!

కరోనా వ్యాపించి రెండేళ్లు అయినా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. రూపాలు మార్చుకుంటూ ఆల్పా, డెల్టా, ఒమిక్రాన్‌లుగా ప్రపంచంపై దండెత్తుతూనే ఉంది.

Masks : మాస్కే శ్రీరామరక్ష..!

Mask

Masks wear to protect against corona : కరోనా వ్యాపించి రెండేళ్లు అయినా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. రూపాలు మార్చుకుంటూ ఆల్పా, డెల్టా, ఒమిక్రాన్‌లుగా ప్రపంచంపై దండెత్తుతూనే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. మనం తీసుకునే స్వీయ నిబంధనలే కరోనా నుంచి కాపాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడంతో పాటు.. భౌతిక దూరం పాటించడం.. మాస్కులను ఎప్పటికీ వాడటం వంటివి చేస్తే కరోనా బారి నుంచి తప్పించుకోవడం సాధ్యం అవుతుందని చెబుతున్నారు. మాస్కులు ధరించడమే శ్రీరామరక్ష అని వెల్లడిస్తున్నారు.

అయితే కొంత మంది మాత్రం ఎంత చెప్పినా.. మాస్కులు పెట్టుకోవడం లేదు. దీంతో వారే కాకుండా, పక్కవారిని కూడా కరోనా మహమ్మారికి దగ్గర చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇండియాలో ప్రతీ ముగ్గురిలో ఒకరు మాస్కు పెట్టుకోవడం లేదని తేలింది. మాస్కులు పెట్టుకోకుండానే బయటకు వెళ్తున్నారని సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 3వందల 64 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. ఇప్పటికే మన దేశంలో ఒమిక్రాన్ ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండకుంటే.. ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Omicron In India : భారత్‌లో 5కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్

ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న ఒమిక్రాన్.. భారత్ లో అలజడి రేపుతోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇక ఢిల్లీలో పదుల సంఖ్యలో ఒమిక్రాన్ అనుమానితులను గుర్తించిన అధికారులు.. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా…వాటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముందు కర్నాటకలో 2, ఆ తర్వాత గుజరాత్ లో 1, మహారాష్ట్రలో మరొకటి బయట పడగా ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ బయట పడటంతో మరింత కలవర పెడుతోంది.

భారత్ లో కరోనా థర్డ్ వేమ్ ప్రమాద ఘంటికలు మోగనున్నాయా? కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విహారం చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పేలా లేదని అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెగులు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ భారత్ లో అంతకంతకూ వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఇప్పుడిప్పుడే ఇండియాలోకి రాదులే అనుకుంటున్న వర్రీ వేరియంట్ ఎంట్రీ ఇచ్చేసింది. మూడు రోజుల వ్యవధిలో ఐదుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మూడో వేవ్ ముప్పును తెచ్చి పెట్టనుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.