National Anthem Singing Program : నేడు సామూహిక జాతీయ గీతాలాపన..ఉదయం 11.30 గంటలకు ప్రతిచోటా ఎక్కడివారక్కడే

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా... తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. వజ్రోత్సవాల్లో భాగంగా.. ఇవాళ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనుంది. ఉదయం 11.30కు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

National Anthem Singing Program : నేడు సామూహిక జాతీయ గీతాలాపన..ఉదయం 11.30 గంటలకు ప్రతిచోటా ఎక్కడివారక్కడే

National Anthem Singing Program : దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా… తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. వజ్రోత్సవాల్లో భాగంగా.. ఇవాళ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనుంది. ఉదయం 11.30కు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 11.30 గంటలకు యావత్‌ రాష్ట్రమంతా జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సూచించారు. వాహనాల్లో వెళ్లే వారు ఎక్కడికక్కడ ఆపి… వాహనాల్లోంచి దిగి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని సూచించారు. ఆ సమయంలో అంతా రెడ్‌ సిగ్నల్‌ వేయనున్నారు.

CM KCR Vikarabad Tour : నేడు వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌..నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ప్రారంభం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ ఆబిడ్స్‌ సర్కిల్‌లో జరిగే జాతీయ గీతాలాపనలో పాల్గొంటారు. దీంతో ఆబిడ్స్‌, నెక్లెస్‌ రోడ్డు దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు.

ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు ఇలా ప్రతిచోటా ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరారు. ఈనెల 8న వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించింది. ఇవి ఈనెల 22 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ సర్కార్‌ వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమం నిర్వహిస్తోంది.