MJR Trust : నాగర్‌కర్నూల్‌లో MJR ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

నాగర్‌కర్నూల్‌లో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఆదివారం ఉదయం 10.05 గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలో సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించడం ఇది 5వ సారి.

MJR Trust : నాగర్‌కర్నూల్‌లో MJR ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

MJR Trust : నాగర్‌కర్నూల్‌లో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఆదివారం ఉదయం 10.05 గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలో సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించడం ఇది 5వ సారి.

నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వారంతా జనవరి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంప్రదించాలి. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..96182 81999, 90526 01721.

ఎంజేఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 12వ తేదీన నిర్వహించనున్న సామూహిక వివాహ వేడుకలకు ప్రజలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు.

నిరుపేదలను ఆదుకోవడం కోసమే ఎంజేఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునా జనార్దన్ రెడ్డి తెలిపారు. 5వ సారి నిర్వహిస్తున్న సామూహిక వివాహ మహోత్సవాలను నిరుపేదలు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

సామూహిక వివాహ మహోత్సవంలో జంటలకు పెళ్లి బట్టలతో పాటు తలంబ్రాల బట్టలను కూడా ట్రస్ట్ నిర్వాహకులే అందిస్తారు. ఈ వివాహ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సెట్టింగ్ ఏర్పాట్లు చేసారు. భారీ పెళ్లి పందిరి ఏర్పాటు చేసి.. ఒక్కో జంట దగ్గర 10 మంది వరకు కూర్చొనే విధంగా సదుపాయాలు చేశారు. పెళ్లికి వచ్చిన బంధు మిత్రులందరికీ విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అన్ని మతాలను గౌరవిస్తూ వారి సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిపిస్తున్నారు. ప్రతి ఏటా జరిపిస్తున్న ఈ సామూహిక వివాహాలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.

మానవ సేవే మాధవ సేవ అని ఎంజేఆర్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. పేదరికం నుంచి వచ్చిన తనకు పేదరికం అంటే ఏంటో తెలుసని, పేదలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

 

MJR Trust