Telangana DSPs Transfers : నిన్న ఐపీఎస్‌లు, ఇవాళ డీఎస్పీలు.. తెలంగాణలో భారీగా బదిలీలు
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 41 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీజీపీ అంజనీ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

Telangana DSPs Transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 41 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీజీపీ అంజనీ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్ట ఏసీపీ గణేశ్ బదిలీ కాగా.. ఆయన స్థానంలో మోహన్ కుమార్‌ను నియమించారు. కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీగా ధనలక్ష్మి నియమితులయ్యారు. అబిడ్స్ ఏసీపీగా పూర్ణచందర్, మీర్‌చౌక్ ఏసీపీగా దామోదర్ రెడ్డి, సంతోశ్‌నగర్ ఏసీపీగా మహమ్మద్ గౌస్, చార్మినార్ ఏసీపీగా రుద్ర భాస్కర్, మలక్‌పేట్ ఏసీపీగా శ్యాంసుందర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Also Read..Telangana IPS Transfers : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
కాగా, ఇటీవలే రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 91 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు ఇచ్చింది ప్రభుత్వం. జిల్లా ఎస్పీలతో సహా పలువురు సీనియర్ ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఒకే నెలలో రెండు సార్లు పెద్దసంఖ్యలో ఐపీఎస్‌లు బదిలీలు జరగడం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 4వ తేదీన 29 మంది ఐపీఎస్‌ల బదిలీలు కాగా, తాజాగా 91 మందిని బదిలీలు, పోస్టింగ్‌లు చేసింది ప్రభుత్వం. వీటిలో లాంగ్ స్టాండింగ్ పీరియడ్‌లో ఉన్నవారిని ట్రాన్స్‌ఫర్ చేశారు.