Etela Rajender : ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారు-మెదక్ కలెక్టర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడింది వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.

10TV Telugu News

Etela Rajender:  మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడింది వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. ఈటల భూకబ్జాలపై ఈ రోజు ఆయన కలెక్టరేట్ లో మాట్లాడుతూ…. మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో అసైన్డ్ భూముల‌ను జ‌మునా హ్యాచ‌రీస్ క‌బ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలిందని చెప్పారు. 70.33 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన‌ట్లు రెవెన్యూ అధికారుల స‌ర్వేలో తేలింద‌న్నారు.
Also Read : Burglars Attack On MLA House : ఎమ్మెల్యేల ఇళ్లలో దొంగతనానికి యత్నం-చెడ్డీ గ్యాంగ్ పనేనా ?
అచ్చంపేట‌, హ‌కీంపేట ప‌రిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హ‌కీంపేట్‌ శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూముల‌ను క‌బ్జా చేశారని…. స‌ర్వే నంబ‌ర్ 78, 81, 130ల‌లో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను నిర్మించారు. స‌ర్వే నంబ‌ర్ 81లో 5 ఎక‌రాలు, 130లో 3 ఎక‌రాల‌ను అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. మొత్తంగా 56 మంది అసైనీల భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు తేలింద‌ని కలెక్టర్ చెప్పారు.

×