112 ఎకరాల అవినీతి కేసు..అడిషనల్ కలెక్టర్ నగేష్ ని హైదరాబాద్ తరలించిన ఏసీబీ

  • Published By: nagamani ,Published On : September 10, 2020 / 04:41 PM IST
112 ఎకరాల అవినీతి కేసు..అడిషనల్ కలెక్టర్ నగేష్ ని హైదరాబాద్ తరలించిన ఏసీబీ

Medak : Narsapur 112 acres scam : మెదక్ జిల్లాలో 112 ఎకరాల అవినీతి కేసులో Rs.1కోటీ 12 లక్షలు లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. ఏసీబీ అధికారుల‌ దర్యాప్తులో సంచలన విషయాలు బ‌య‌ట‌పడుతున్నాయి. రూ.1కోటీ 12 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన ఈ కేసులో మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు నగేశ్ ను మాధవరం నుంచి హైదరాబాద్ కు తరలించారు. కాసేపట్లో నగేశ్ కు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం నగేశ్ ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


నగేశ్ తో పాటు ఆర్టీవో అరుణారెడ్డి, తహశీల్దార్ అబ్దుల్ సక్తార్,జూనియర్ అసిస్టెంట్ అమ్మద్ లతో పాటు నగేశ్ కు బినామీగా ఉన్న జీవన్ రెడ్డిలను కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.వీరిని కూడా హైదరాబాద్ కు తరలించిన అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.


నర్సాపూర్ 112 ఎకరాల స్కాంలో ఏసీబీ చేపడుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. జులై 31న ఆయన రిటైర్ మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ ముందు రోజు..బాధితుడు మూర్తికి ఇవ్వాల్సిన ఎన్ వోసీ ఫైల్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.


కలెక్టర్ తో సంతకం చేయిస్తానని, మూర్తి నుంచి కలెక్టర్ కు అడిషనల్ కలెక్టర్ నగేష్ వాటా అడిగారు. చిలిపిచేడ్ లో వివాదాస్పద భూమని నిషేధిత జాబితా నుంచి తీసేయాలని రిటైర్మెంట్ రోజున స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కు ధర్మారెడ్డి లేఖ రాశారని దర్యాప్తులో ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.


కలెక్టర్ ఆదేశాల మేరకు 112.21 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రిజస్ట్రర్ కు కమినర్ ఆదేశాలు చేయడం జరిగిపోయాయని సమాచారం. దీంతో ధర్మారెడ్డి పాత్రపై విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది. దీంట్లో భాగంగానే నగేశ్ తో పాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహశీల్దార్ అబ్దుల్ సత్తార్, జూ.అసిస్టెంట్ వసీం మహ్మద్, జీవన్ గౌడ్ లు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరిని కూడా హైదరాబాద్ కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరుచనున్నారు.