Telangana : కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 239 కరోనా యాక్టివ్ కేసులుండగా..మొత్తం ఇద్దరు చనిపోయారు. మొత్తం 4 వేల 778 యాక్టివ్ కేసులున్నాయి.

10TV Telugu News

COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా తోకముడుస్తోంది. మెల్లిమెల్లిగా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 239 యాక్టివ్ కేసులుండగా..మొత్తం ఇద్దరు చనిపోయారు. మొత్తం 4 వేల 778 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 911 మరణాలు సంభవించాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 68 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 24 గంటల్లో 336 మంది కోలుకున్నారు. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 4 వేల 778గా ఉంది. గత 24 గంటల్లో 50 వేల 569గా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 45 వేల 119, ప్రైవేటు ఆసుపత్రుల్లో 5 వేల 450 శాంపిల్స్ చేశారు.

Read More : Liquor Shops : నో లిక్కర్, మందుబాబుల కష్టాలు..సరిపడా స్టాక్ ఉంచాలన్న సర్కార్!

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : – ఆదిలాబాద్ 03. భద్రాద్రి కొత్తగూడెం 05. జీహెచ్ఎంసీ 68. జగిత్యాల 10. జనగామ 05. జయశంకర్ భూపాలపల్లి 01. జోగులాంబ గద్వాల 01. కామారెడ్డి 01. కరీంనగర్ 17. ఖమ్మం 08. కొమరం భీం ఆసిఫాబాద్ 02. మహబూబ్ నగర్ 03. మహబూబాబాద్ 02. మంచిర్యాల 06. మెదక్ 03. మేడ్చల్ మల్కాజ్ గిరి 10. ములుగు 01. నాగర్ కర్నూలు 03. నల్గొండ 16. నారాయణపేట 00. నిర్మల్ 00. నిజామాబాద్ 04. పెద్దపల్లి 08. రాజన్న సిరిసిల్ల 05. రంగారెడ్డి 16. సంగారెడ్డి 03. సిద్దిపేట 05. సూర్యాపేట 07. వికారాబాద్ 02. వనపర్తి 03. వరంగల్ రూరల్ 04. వరంగల్ అర్బన్ 12. యాదాద్రి భువనగిరి 05. మొత్తం : 239.