Telangana Covid : మళ్లీ పెరుగుతున్న కేసులు, 24 గంటల్లో ఎన్ని వచ్చాయంటే

గత 24 గంటల్లో 3 వేల 801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 046 మంది...

Telangana Covid : మళ్లీ పెరుగుతున్న కేసులు, 24 గంటల్లో ఎన్ని వచ్చాయంటే

Telangana Corona

Telangana Corona New Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనా భయపెట్టిస్తోంది. తగ్గిపోతుందని అనుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. చలికాలంలో వైరస్ పంజా విసురుతోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో టెస్టింగ్ ల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అంతేగాకుండా..రాష్ట్రంలో ఫీవర్ సర్వే కూడా చేపట్టింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. గత 24 గంటల్లో 3 వేల 801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 046 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,05,054 ఉందని పేర్కొంది.

జిల్లాల వారీగా కేసులు : – ఆదిలాబాద్ 43, భద్రాద్రి కొత్తగూడెం 78, జీహెచ్ఎంసీ 1570, జగిత్యాల 55, జనగాం 48, జయశంకర్ భూపాలపల్లి 29, జోగులాంబ గద్వాల 24, కామారెడ్డి 35, కరీంనగర్ 79, ఖమ్మం 139, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 17, మహబూబ్ నగర్ 86, మహబూబాబాద్ 44, మంచిర్యాల 67, మెదక్ 27, మేడ్చల్ మల్కాజ్ గిరి 254, ములుగు 28, నాగర్ కర్నూలు 38, నల్గొండ 70, నారాయణపేట 25, నిర్మల్ 22, నిజామాబాద్ 62, పెద్దపల్లి 51, రాజన్న సిరిసిల్ల 31, రంగారెడ్డి 284, సంగారెడ్డి 88, సిద్ధిపేట 96, సూర్యాపేట 59, వికారాబాద్ 39, వనపర్తి 40, వరంగల్ రూరల్ 75, హన్మకొండ 147, యాదాద్రి భువనగిరి 51. మొత్తం : 3,801