తెలంగాణలో కరోనా : 24 గంటల్లో 978, జీహెచ్ఎంసీలో 185 కేసులు

10TV Telugu News

COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు..వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో 5 నుంచి 2 వేల వరకు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1000కి దిగువన పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.
తాజాగా 24 గంటల్లో 978 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కోలుకున్న వారు 1,446గా ఉంది.
మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 31 వేల 252గా ఉందని, కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 10 వేల 480గా ఉందని తెలిపింది. 24 గంటల్లో 4గురు మరణించినట్లు,
మరణాల రేటు విషయానికి వస్తే..0.56గా ఉందని తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 465 ఉండగా, గృహ/సంస్థల ఐసోలేషన్ లో గల వ్యక్తుల సంఖ్య 16 వేల 430 గా వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసులు : –
ఆదిలాబాద్ 20. భద్రాద్రి కొత్తగూడెం 47. జీహెచ్ఎంసీ 185. జగిత్యాల 25. జనగామ 16. జయశంకర్ భూపాలపల్లి 09. జోగులాంబ గద్వాల 12. కామారెడ్డి 18. కరీంనగర్ 27. ఖమ్మం 62. కొమరం భీం ఆసిఫాబాద్ 02. మహబూబ్ నగర్ 17.
మహబూబాబాద్ 12. మంచిర్యాల 22. మెదక్ 18. మేడ్చల్ మల్కాజ్ గిరి 86. ములుగు 09. నాగర్ కర్నూలు 21. నల్గొండ 59. నారాయణపేట 01. నిర్మల్ 10. నిజామాబాద్ 18. పెద్దపల్లి 12. రాజన్న సిరిసిల్ల 22. రంగారెడ్డి 89. సంగారెడ్డి 24. సిద్దిపేట 27. సూర్యాపేట 24. వికారాబాద్ 15. వనపర్తి 19. వరంగల్ రూరల్ 11. వరంగల్ అర్బన్ 25. యాదాద్రి భువనగిరి 14.
మొత్తం : 978

×