Corona : కరీంనగర్‌లో కరోనా కలకలం.. ఒకే కాలేజీలో 49మంది విద్యార్థులకు పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. పలు విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లోని చల్మెడ మెడికల్ కాలేజీలో 39మంది వైద్య విద్యార్థులు కరోనా..

Corona : కరీంనగర్‌లో కరోనా కలకలం.. ఒకే కాలేజీలో 49మంది విద్యార్థులకు పాజిటివ్

Corona Karimnagar

Corona : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. పలు విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లో చల్మెడ మెడికల్ కాలేజీలో 49మంది వైద్య విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో యాజమాన్యం కాలేజీకి సెలవు ప్రకటించింది. వారం రోజుల క్రితం కాలేజీలో స్నాతకోత్సవం జరిగింది. ఆ సమయంలో కరోనా లక్షణాలన్న ఒకరిద్దరు విద్యార్థుల నుంచి మిగిలిన వారికి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.

నిన్నటి పరీక్షల్లో 18 మందికి నిర్ధారణ కాగా, ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో 31 మందికి పాజిటివ్‌గా తేలింది. కొందరు విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ బాధితులు క్వారంటైన్ కి వెళ్లారు. అప్రమత్తం అయిన అధికారులు ముందు జాగ్రత్తగా కరోనా లక్షణాలు లేకున్నా మిగతా విద్యార్థులకు కూడా కోవిడ్ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. కాగా, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, ముత్తంగి గురుకులాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు వచ్చాయి.

 

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

విద్యాసంస్థల్లో మరోసారి కరోనా కలకలం రేగడం విద్యార్థులను, టీచర్లను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ​ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఐదుకి పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్​లో కరోనా థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. థర్డ్ వేవ్​ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఈ రకం కరోనా కేసులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. మన దేశంలో తొలుత కర్నాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్​లోని జామ్​నగర్​లో మూడో కేసు వచ్చింది. నిన్న(శనివారం) ముంబైలో నాలుగో కేసు నమోదవగా.. తాజాగా ఆదివారం ఢిల్లీలో ఐదో కేసు బయటపడింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్​ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు.

iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఇదిలా ఉండగా.. ఒడిశా, కేరళ, తమిళనాడు, మిజోరం, జమ్ము కశ్మీర్​లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ భయాలు కూడా థర్డ్​ వేవ్​ రావచ్చనే సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్లు అనేకం వచ్చాయి. అందులో డెల్టా వేరియంట్​ ఇప్పటివరకు ప్రమాదకరంగా గుర్తించారు. అయితే ఒమిక్రాన్​ అంతకన్నా ప్రమాదకరమని తెలుస్తోంది. ఇందుకు కారణం.. డెల్టా ప్లస్​లో రెండు మూడు ఉత్పరివర్తనాలను మాత్రమే గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అదే ఒమిక్రాన్​లో 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నట్టు గుర్తించారు.