MEIL Oxygen : విదేశాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్న మేఘా సంస్థ, ప్రభుత్వానికి ఉచితంగా అందజేత

దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. మొదటి

MEIL Oxygen : విదేశాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్న మేఘా సంస్థ, ప్రభుత్వానికి ఉచితంగా అందజేత

Meil Oxygen

MEIL Oxygen Tanks : దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు హైదరాబాద్ బేగంటపేట ఎయిర్ పోర్టుకి చేరుకుంటాయి.

ఈ ట్యాంకర్లను MEIL సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా అందించనుంది. దేశంలో ఈ తరహాలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుని ప్రభుత్వానికి అందిస్తున్న తొలి సంస్థ MEIL. ఒక్కో క్రయోజనిక్ ట్యాంకర్ కోటి 40లక్షల లీటర్ల ఆక్సిజన్ అందిస్తుంది. కరోనా ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలు రక్షించేందుకు MEIL చేస్తున్న కృషి పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.