కరెన్సీ నోట్లను నీటిలో కడిగి, శానిటైజ్ చేసి తీసుకుంటున్న వ్యాపారులు…కరీంనగర్ లో కరోనా భయం

  • Published By: bheemraj ,Published On : July 27, 2020 / 07:18 PM IST
కరెన్సీ నోట్లను నీటిలో కడిగి, శానిటైజ్ చేసి తీసుకుంటున్న వ్యాపారులు…కరీంనగర్ లో కరోనా భయం

కరోనా వైరస్ వ్యాపారులకు, వినియోగదారులకు కొత్త కష్టాలు తెస్తోంది. నోట్లు తాకితే ఎక్కడ కరోనా సోకుంతుందోనన్న భయంతో చాలా ప్రాంతాల్లో నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరీంనగర్ జిల్లాలో కొందరు వ్యాపారులు వినూత్నప్రయత్నాలు చేస్తున్నారు.

కస్టమర్లు ఇచ్చే డబ్బులను కడిగి తీసుకుంటున్నారు. డబ్బు నేరుగా తీసుకోకుండా నీళ్లలో వేయమంటున్నారు. ఇందుకోసం షాప్స్ ముందు వాటర్ టబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. నోట్లను నీళ్లతో కడిగి అనంతరం శానిటైజ్ చేసి వాడుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజరోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2077 కరోనా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వ్యాపారులతోపాటు స్థానికులు కరోనా దరిచేరకుండా తగు చర్యలు చేపడుతున్నారు.

కరీంనగర్ జిల్లాలో ఓ వ్యాపారి మాత్రం తనకు వచ్చే గిరాకీ ఏదైతే ఉందో ఆ డబ్బులను కూడా నేరుగా ముట్టుకోవడం లేదు. అన్నింటినీ మొదటా నీటిలో వేసి శానిటైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వ్యాపరైజర్ అనే యంత్రంతో వాటిని ఎండ బెడుతున్నారు. ఇలా వ్యాపరైజర్ మిషన్ తో షాప్ అంతా కూడా శానిటైజ్ చేస్తున్నారు.

వైరస్ నివారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. గతంలో డబ్బులను చేతితో తీసుకుని లెక్కించుకుని కౌంటర్ లో వేసుకునేవారు. కానీ దానికి చాలా మంది వ్యాపారులు దూరంగా ఉంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువ శాతం వ్యాపారులు కరోనా సోకుతుండటంతో ఇలాంటి చర్యలు చేపడతున్నారు.