Heavy Rain : తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు..హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉత్తర, దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ప్రకటించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది.

Heavy Rain : తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు..హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

Weather alert

heavy rain forecast : తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉత్తర, దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ప్రకటించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది.

నిన్న హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం నగరంలో పలు చోట్ల వాన కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, లక్డీకపూల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపైనే నీరు నిలిచిపోయింది. గత వారం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.

Rains In Telangana : బుధ,గురువారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు

BHEL, మియాపూర్ ఏరియాల్లో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో BHEL నుంచి మియాపూర్ వ‌ర‌కు రోడ్లపై వ‌ర్షపు నీరు నిలిచింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాయంత్రం ఆరు గంటల నుంచి వాహ‌నాలు ముందుకు క‌ద‌ల‌లేదు. వాహ‌న‌దారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.