KTR గొప్ప మనస్సు : అర్ధరాత్రి 5 నెలల చిన్నారికి పాలు

KTR గొప్ప మనస్సు : అర్ధరాత్రి 5 నెలల చిన్నారికి పాలు

తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ మంత్రిగా పేరొందిన కేటీఆర్ మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఐదు నెలల చిన్నారి తాగేందుకు పాలు లేవని..చేసిన ట్వీట్ కు వెంటన రెస్పాండ్ అయ్యారు. పాలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించడం..GHMC డిప్యూటి మేయర్ బాబా ఫసీయుద్దీన్ పాపకు కావాల్సిన పాలను అందించారు. దీనిపై మంత్రి కేటీఆర్, బాబా ఫసీయుద్దీన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తుంటారు. తన దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తుంటారు. ప్రస్తుతం కరోనా రాకాసి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో ఆయనకు విన్నవించుకొనే వారి సంఖ్య కూడా పెరిగింది. తన కార్యాలయం ద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తున్నారు.

ఎర్రగడ్డలో నివాసం ఉండే ఓ కుటుంబం రోజువారి కూలి పనులు చేసుకుంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. కానీ కొద్ది రోజుల కిందట.. అనారోగ్య కారణాలతో భార్య చనిపోయింది. ఐదు నెలల పసికందు బాధ్యతలను తండ్రి చూసుకుంటున్నాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఇతనికి నెల రోజుల నుంచి ఉపాధి లేదు. పాపకు పాలు, ఇతర నిత్యావసర సరుకులు అందించడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి తెలుసుకున్నాడు.

2020, ఏప్రిల్ 16వ తేదీ గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలియచేశారు. తక్షణమే స్పందించిన ఆయన..వెంటనే వెళ్లి ఆదుకోవాలని GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కు సూచించారు. వెంటనే రెస్పాండ్ అయిన ఫసీయుద్దీన్ అరగంటలోపే..ఎర్రగడ్డ ప్రాంతానికి చేరుకున్నారు. పసికందుకు కావాల్సిన పాలను అందచేశారు. అంతేగాకుండా…ఇతర..వస్తువలతో పాటు, నెల రోజులకు సరిపడా..నిత్యావసర సరుకులను అందించారు. క్లిష్ట సమయంలో ఆదుకున్న మంత్రి కేటీఆర్, ఫసీయుద్దీన్ కు కాలనీ వాసులు థాంక్స్ చెప్పారు. చెప్పగానే స్పందించిన ఫసీయుద్దీన్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు.