Mini Municipolls Counting : మినీ మున్సిపోల్స్.. ఖమ్మంలో 4 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం

తెలంగాణ మినీ మున్సిపోల్స్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్ లోని 4 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు డివిజన్లలో సీపీఐ గెలిచింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఒక్కో చోట విజయం సాధించింది.

Mini Municipolls Counting : మినీ మున్సిపోల్స్.. ఖమ్మంలో 4 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం

Mini Muncipolls Counting In Telangana State

Mini Municipolls Counting : తెలంగాణ మినీ మున్సిపోల్స్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్ లోని 4 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు డివిజన్లలో సీపీఐ గెలిచింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఒక్కో చోట విజయం సాధించింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను మొత్తం 10 కౌంటింగ్‌ కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. నగరంలోని ఎస్‌ఆర్‌, బీజీఎన్నార్‌ కళాశాలలో లెక్కింపు జరుగుతోంది. సాయంత్రంలోగా ఖమ్మం మేయర్‌ పీఠం ఎవరిదో తేలనుంది.

ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేశారు అధికారులు. ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు అందరూ కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. సోమవారం ఉదయం 8 గంటలకే ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులను ఓపెన్‌ చేశారు. 25 బ్యాలెట్లను ఒక బండిల్‌గా కట్టేశారు. ఆ తర్వాత ఓట్లను లెక్కించనున్నారు అధికారులు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లను మూడు బ్లాకులుగా విభజించారు. ఒక్కో డివిజన్‌కు రెండు టేబుళ్లు ఉంటాయి. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్‌కు ఇద్దరు కౌంటింగ్‌ ఏజెంట్లు, ఇద్దరు సిబ్బంది, ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు. ఓట్ల లెక్కింపును తిలకించేందుకు ప్రత్యేకంగా మెష్‌ ఏర్పాటు చేశారు. 66 డివిజన్లలో 54 పాయింట్‌ 74 పోలింగ్‌ శాతం నమోదైంది. సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.