TRS Govt Vs Governor : గవర్నర్ వ్యవస్థను కించపరచటంవల్లే తమిళిసైకు గౌరవం దక్కటంలేదు : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విమర్శలు చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో ఎందుకు అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా? అంటూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తమిళిసై చేసిన విమర్శలకు మంత్రి ఎర్రబెల్లి ప్రతి విమర్శలు చేశారు. గవర్నర్ వ్యవస్థను కించపరచటంవల్లే తమిళిసైకు గౌరవం దక్కటంలేదని అన్నారు.

TRS Govt Vs Governor : గవర్నర్ వ్యవస్థను కించపరచటంవల్లే తమిళిసైకు గౌరవం దక్కటంలేదు : మంత్రి ఎర్రబెల్లి

TRS Govt Vs Governor :

TRS Govt Vs Governor :తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విమర్శలు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తాను బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడారు. ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేదని..వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో ఎందుకు అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా? అంటూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య మరోసారి గ్యాప్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

కాగా..గవర్నర్ తమిళిసై చేసిన ఈ వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ అనే హుందాతనాన్ని తమిళిసై మర్చిపోయి వ్యవహరిస్తున్నారని..గవర్నర్ వ్యవస్థను కించపరచటంవల్లే తమిళిసైకు గౌరవం దక్కటంలేదు అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. గవర్నర్ తమిళిసై బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవహారశైలి ప్రజలను బాధపెడతున్నాయన్నారు. గవర్నర్ వ్యవస్థను తమిళిసై కించపరురుస్తున్నారని అందుకే ఆమెకు గౌరవం దక్కటంలేదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై తమిళిసై ఉద్ధేశపూర్వకంగానే వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు.

గవర్నర్ మాట్లాడుతూ.. తనతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని తమిళిసై ప్రశ్నించారు. తన మనో ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని..వివక్షను ఏమాత్రం సహించను అంటూ తమిళసై స్పష్టంచేశారు. సర్వీస్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి కరెక్ట్ కాదనే రిజెక్ట చేశానని చెప్పారు. ఆ విషయంలో నిబంధనల మేరకే వ్యవహరించానని మరోసారి స్పష్టంచేశారు గవర్నర్. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య మరోసారి గ్యాప్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్.. విభజన సమస్యల పరిష్కారానికి అవకాశం వచ్చినా వినియోగించుకోవడం లేదని అన్నారు. రేపు మరో గవర్నర్ వచ్చినా ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. ఎట్‌హోమ్‌కు వస్తానని రాకపోవడం కరెక్టేనా? చెప్పాలని అడిగారు. పార్టీలను చూసి తాను అపాయింట్‌మెంట్ ఇవ్వనని చెప్పారు. తాను వివాదస్పద వ్యక్తిని కాదని అన్నారు. అందరికి తాను సమ న్యాయం చేశానని చెప్పారు. గవర్నర్ ఆఫీస్‌పై తీవ్ర వివక్ష చూపిస్తున్నారని అన్నారు. ఈ మూడేళ్లలో గవర్నర్‌పై చూపిన వివక్ష చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తాను ఎప్పుడూ పరిధి దాటలేదని చెప్పారు.

సీఎం పనితీరుపై గ్రేడ్ ఇవ్వడానికి తాను చాలా చిన్న వ్యక్తినంటూ కామెంట్ చేశారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు అనేవారు.. సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఎందుకు అడగరని ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ తనను దూరం పెట్టారని..అసెంబ్లీలో గవర్నర్ సందేశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని చెప్పారు. సన్మానం జరిగినా జరగకపోయినా తన కృషిలో మార్పు ఉండదని చెప్పారు. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగిన స్పందించలేదని తమిళిసై అన్నారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని చెప్పుకొచ్చారు.

తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని చెప్పారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని అన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవని చెప్పారు. తనకు గౌరవం ఇవ్వకపోతే తానేమి తక్కువ కానని.. తన పనిని తాను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

గవర్నర్ స్థానానికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని తమిళిసై మండిపడ్డారు. మేడారం, భద్రాచలం పర్యటనలకు వెళ్లినప్పుడు హెలీకాప్టర్ అడిగితే కనీసం స్పందించలేదని గుర్తుచేసుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా 8 గంటలు ప్రయాణించి వెళ్లానని తెలిపారు. ప్రజల్ని కలవాలంటే కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి కూడా రాలేదని గుర్తు చేశారు. సమాచారం కూడా అందించలేదన్నారు. ఇలాంటివి ఇష్యూ చేయాలని లేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి నిజంగా అధ్వాన్నంగా ఉందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుతున్నారని..రాజకీయ నాయకులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. తమ పనిని నిర్వహిస్తుంటే.. అందుబాటులో ఉంటే ప్రజలు తన వద్దకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి తప్పు పట్టారు. గవర్నర్ తమిళిసై ఉద్ధేశ్యపూర్వకంగా ప్రభుత్వ ఆస్పత్రుల గురించి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు.