Errabelli Dayakar Rao : రాహుల్ గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుంది.. రేవంత్, బండి సంజయ్‌కి జైలుశిక్ష తప్పదు-మంత్రి ఎర్రబెల్లి
మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్, బండి సంజయ్ కి జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుందన్నారు.(Errabelli Dayakar Rao)

Errabelli Dayakar Rao : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం అగ్గి రాజేసింది. కాంగ్రెస్, బీజేపీలు.. అధికార బీఎఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. తీవ్రమైన ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందని సీరియస్ ఆరోపణలు చేశారు.
దీనికి మంత్రి కేటీఆర్ సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు నోటీసులు పంపినట్టు తెలిపారు. రాజకీయ దురుద్దేశంలో తన పేరును అనవసరంగా లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్, బండి సంజయ్ కి జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుందన్నారు.(Errabelli Dayakar Rao)
TSPSC పేపర్ లీక్ ఆరోపణలపై మంత్రి ఎర్రబెల్లి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకపోవడం వల్లే ఆయనకు రెండేళ్ల శిక్ష పడిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. TSPSC వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆధారాలు చూపాలని మంత్రి ఎర్రబెల్లి సవాల్ చేశారు. లేదంటే వారిని కూడా చట్టపరంగా శిక్షించాలన్నారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ 10వేల రూపాయల పరిహారం అందించి ఆదుకున్నారని మంత్రి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎకరానికి కేవలం 5 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రైతుల కష్టాన్ని కూడా రాజకీయం చేస్తున్న బీజేపీ-కాంగ్రెస్ నేతలు.. ముందు తెలంగాణ తరహాలో బాధిత రైతులకు రూ.10వేలు ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.(Errabelli Dayakar Rao)
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వారిద్దరికీ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు నోటీసులు పంపినట్టు తెలిపారు. రాజకీయ దురుద్దేశంలో తన పేరును అనవసరంగా లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్రభుత్వ పరిధిలోనే ఇదంతా జరుగుతోందనే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారిద్దరూ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు కేటీఆర్.