Minister Errabelli Dayakar Rao : ప్రీతి కుటుంబానికి న్యాయం చేయకపోతే నేను మంత్రిగా ఉండి కూడా వేస్ట్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Minister Errabelli Dayakar Rao : ప్రీతి కుటుంబానికి న్యాయం చేయకపోతే నేను మంత్రిగా ఉండి కూడా వేస్ట్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli Dayakar

Minister Errabelli Dayakar Rao : మెడికో ప్రీతి కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మెడికో ప్రీతి కేసులో రిపోర్టులు కీలకం కానున్నాయి. నిన్న(సోమవారం) ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. ప్రీతి చనిపోయే 5 గంటల ముందు ఏం జరిగిందో చెప్పాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి ఆత్మహత్యపై మంగళవారం రిపోర్టు వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రిపోర్టు వచ్చిన తర్వాత దాంట్లో ఏ ముందో తెలుస్తుందన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయకపోతే తాను మంత్రిగా ఉండి కూడా వేస్ట్ అని చెప్పారు. తప్పు చేసిన వారందరిపై వేటు పడుతుందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దోషులు ఎవరైనా సరే వదిలేది లేదని..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు.

KTR On Medico Preethi : మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టం-మంత్రి కేటీఆర్

ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రీతి ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రీతి ఆస్పత్రిలో చేరినప్పటికీ నుంచి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రీతి కేసులో ఎఫ్ఎస్ ఎల్ రిపోర్టుతోపాటు హిస్టో పాథలాజికల్ రిపోర్టు అత్యంత కీలకం కాబోతుంది.

హిస్టో పాథలాజికల్ రిపోర్టులో ప్రీతి మృతికి స్పష్టమైన కారణాలు తెలుస్తాయని భావిస్తున్నారు. హిస్టో పాథలాజికల్ రిపోర్టు కోసం డ్యామేజ్ అయిన ప్రీతి ఆర్గాన్స్ లోని శాంపిల్స్ భద్రపరిచారు.అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఫోరెన్సిక్ టీమ్ శాంపిల్స్ సేకరించారు. ప్రీతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తన్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.