Coronavirus : తెలంగాణ ప్రజలు భయపడొద్దు

Coronavirus.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. చైనాలోని వుహన్ సిటీలో పుట్టన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 09:42 AM IST
Coronavirus : తెలంగాణ ప్రజలు భయపడొద్దు

Coronavirus.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. చైనాలోని వుహన్ సిటీలో పుట్టన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని

Coronavirus.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. చైనాలోని వుహన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయం అందరిని బెంబేలెత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చైనాలో వందల మందికి సోకింది. 100 మందికి పైగా చనిపోయారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ వరకు పాకింది.

భారత దేశంలోనూ Coronavirus ఆందోళన నెలకొంది. భారతీయులు భయాందోళన చెందుతున్నారు. చైనా నుంచి వచ్చిన కొందరు భారతీయులకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భయం పట్టుకుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టాయి. వైద్య అధికారులను అలర్ట్ చేశారు.

Coronavirus పై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం(జనవరి 29,2020) మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురికావొద్దన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని చెప్పారు. స్వైన్ ఫ్లూ లక్షణాలే కరోనా వైరస్ కు ఉంటాయన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ స్పెషల్ వార్డులు, 100 పడకలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. డాక్టర్ విజయ్ కుమార్ ను ప్రత్యేక అధికారిగా నియమించామని వెల్లడించారు.

Coronavirus గురించి సోసల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాగా మేడారం జాతరకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు. మేడారం పరిసరాల్లోని అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశామన్నారు.

ప్రస్తుతం.. జలుబు చేస్తే చాలు కరోనా వైరస్ అని భయపడే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి వరకు భయపెట్టిన స్వైన్‌ ఫ్లూ.. కాస్త తగ్గుముఖం పట్టగానే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ సోకి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 2వేలకు పైగానే కరోనా కేసులు నమోదైనట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

చైనాలో వుహన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ మెల్లమెల్లగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంగ్ కాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్ లాండ్, వియత్నాం తదితర దేశాలకు వ్యాపించింది. పాకిస్తాన్ కు కూడా ఈ వైరస్ విస్తరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

కరోనా వైరస్ లక్షణాలు :
* ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. 
* తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి.
* ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది.
* శ్వాసలో ఇబ్బందులు.

ఈ లక్షణాలు ఉంటే ఏమి చేయాలి : 
* ఇలాంటి లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్ ను కలవాలి. 

ఎలా వ్యాపించవచ్చు :
* ప్రస్తుతం ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. 
* వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్క వారికి వచ్చే ప్రమాదం ఉంది. 
* వైరస్ సోకిన రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. 
* రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. 

సోకితే ఏమవుతుంది ?
ఈ వైరస్ సోకితే శ్వాస వ్యవస్థ నిర్వీర్యమవుతుంది.

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు, నీళ్లు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్స్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
* దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు టిష్యూ లేదా క్లాత్ తో ముక్కు, నోరు కప్పుకోవాలి.
* జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
* మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినాలి.
* రక్షణ లేకుండా పెంపుడు జంతువులు, మిగతా జంతువులను తాకకూడదు.
* మాస్క్ ధరించాలి.
* గుంపుల్లో తిరగకూడదు.