Etela Rajender: మంత్రి ఈటలపై వేటు.. సీఎం చేతుల్లోకి వైద్య ఆరోగ్యశాఖ

Etela Rajender: మంత్రి ఈటలపై వేటు.. సీఎం చేతుల్లోకి వైద్య ఆరోగ్యశాఖ

Etela Rajender

Minister Etela Suspended: ఆరోపణలపై స్పందించిన కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించగా.. సీఎం ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది. అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కి ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు చేరుకుని ధర్యాప్తు చెయ్యగా.. రైతుల నుండి రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు తీసుకున్నారు.

ప్రాధమిక రిపోర్ట్ అందుకున్న సీఎం కేసీఆర్.. ఈటల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వశాఖ నుంచి తొలగించారు. ఈటల వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ఉండగా.. శాఖలేని మంత్రిగా ఈటల ఉన్నారు. బర్తరఫ్‌‌కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నిర్ణయంతో ఈటల రాజేందర్ స్వయంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. శాఖ లేని మంత్రిగా కొనసాగుతారా? అనేది ఆసక్తకరంగా మారింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే.. శాఖ నుంచి తొలగించడమో? ఆయనతో రాజీనామా చేయించడమో జరుగుతుందని భావించగా.. ఆరోపణలపై వెంటనే నిర్ణయం తీసుకోవడం సంచలనం అయ్యింది.

ఈటల రాజేందర్‌కు, కేసీఆర్‌కు కాస్త గ్యాప్ ఉన్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు ఉండగా.. వేటుకు సంబంధించి గవర్నర్‌కు లేఖ రాయడంతో పాటు.. వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా విస్తృతంగా విస్తరించిన సమయంలో కేసీఆర్ చేతికి ఈ శాఖ వెళ్లడం విశేషం. కేసీఆర్ నిర్ణయంతో ఈటల ఇంటికే పరిమితం కానున్నారు.