Minister Gangula : వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల ఆదేశాలు
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Gangula
procurement of monsoon grain : వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 4,039 కొనుగోలు కేంద్రాల్లో నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు.
2020 సీజన్ లో నవంబర్ 13 వరకు దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించామని తెలిపారు. ఈ సీజన్ లో నిన్నటి వరకు 7.71 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. ధాన్యం రవాణాలోనూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Central Government : సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతోందన్నారు.