Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్

కరోనా టెస్ట్ పాజిటివ్ రావడంతో.. మంత్రి గంగుల హోం క్వారంటైన్ అయ్యారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు వైద్య సలహా తీసుకుని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తిచేశారు.

10TV Telugu News

Gangula Kamalakar : కరీంనగర్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారు గంగుల. ఆయన జరిపిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు గంగుల కమలాకర్. మంత్రి హరీష్ రావు ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోక ముందే… హుజూరాబాద్ లో మొత్తం ఓ రౌండ్ వేశారు. ప్రగతి పనులు మొదలుపెట్టి.. ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంత్రి హరీష్ తో కలిసి… వరుసగా కొద్దిరోజుల నుంచి సభలు, సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు.

ఐతే… కరోనా టెస్ట్ పాజిటివ్ రావడంతో.. మంత్రి గంగుల హోం క్వారంటైన్ అయ్యారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు వైద్య సలహా తీసుకుని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తిచేశారు.