Khammam Politics: ఖమ్మంకు హరీష్ రావు, రేవంత్ రెడ్డి.. జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్..

మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలుచేసే అవకాశాలు ఉన్నాయి.

Khammam Politics: ఖమ్మంకు హరీష్ రావు, రేవంత్ రెడ్డి.. జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్..

Harish Rao and Revanth Reddy

Khammam Politics: ఖమ్మం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాల శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ జిల్లాలో గత రెండు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉమ్మండి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేలా కసరత్తు మొదలు పెట్టింది. పోటీగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సాధించేందుకు దృష్టిసారించింది. ఈ క్రమంలో సోమవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు మంత్రి హరీష్‌రావు జిల్లాకు రానుండగా.. కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖమ్మంకు రానున్నారు.

Jupally Ponguleti : వీడిన సస్పెన్స్.. కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

ఖమ్మం జిల్లా అధికార పార్టీలో వర్గవిబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం విధితమే. పొంగులేటి సైతం సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి.. భారీ సంఖ్యలో తన మద్దతు దారులతో బీజేపీ లేదా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పొంగులేటి వెంట బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ వెళ్లకుండా జిల్లా నేతలతో పాటు రాష్ట్ర పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో సోమవారం జరిగే ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు పాల్గోనున్నారు. అంతేకాక పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

BRS Suspends Ponguleti : నన్ను సస్పెండ్ చేయటం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది : పొంగులేటి

హరీష్ రావు ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ నుంచి బహిష్కరించక ముందు, బహిష్కరించిన తరువాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనికితోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించకుండా అడ్డుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో హరీష్‌రావు పొంగులేటి విషయంలో ఏ విధంగా స్పందిస్తారనేది జిల్లాలోనేకాక రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Ponguleti Srinivasa Reddy: ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా.. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది: పొంగులేటి వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో పూర్వవైభవంకోసం కృషిచేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను ఒకేతాటిపైకి తెచ్చేలా అధిష్టానం దృష్టిసారించింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్, పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారం, ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష  ఖమ్మం నగరంలో  నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. పాత బస్టాండ్ సెంటర్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు భారీగా పార్టీ శ్రేణులను తరలించే పనిలో జిల్లా నేతలు నిమగ్నమయ్యారు. అయితే, జిల్లా కాంగ్రెస్‌లో పలువురు నేతలు గ్రూపులుగా విడిపోయారు. రేవంత్ జిల్లాకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్‌లోని గ్రూప్‌లన్నీ ఒకే వేధికమీదకు వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.