Minister Harish Rao : రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది : మంత్రి హరీష్ రావు

అర్హులందరికీ త్వరగా వ్యాక్సిన్లు ఇస్తామని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.

Minister Harish Rao : రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది : మంత్రి హరీష్ రావు

Harish Rao

situation of Corona in the state : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని కేటినెట్ కు మంత్రి హరీశ్ రావు వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కో్ట్ల కరోనా టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

అర్హులందరికీ త్వరగా వ్యాక్సిన్లు ఇస్తామని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వీయ నియంత్రణ ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని చెప్పారు. ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Corona Positive : కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో 70 మంది విద్యార్థులకు కరోనా.. అయినా ఎగ్జామ్స్ కు హాజరుకావాలని ఆదేశాలు

ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేయనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా? లేక నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారా? సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు పెరిగుతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్ వణికిస్తున్నాయి. నిన్న 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా… 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి.

Nara Lokesh Corona : టీడీపీ నేత నారా లోకేష్ కు కరోనా పాజిటివ్

కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇక విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.