Minister Harish Rao : చర్చకు రెడీ.. టైం, ప్లేస్ ఫిక్స్ చేయండి : బండికి హరీష్ రావు సవాల్

కేంద్రం రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తన ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనవాయితి అని తెలిపారు. సెస్ ల రూపంలో వసూలు చేస్తూ.....రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోందని విమర్శించారు.

Minister Harish Rao : చర్చకు రెడీ.. టైం, ప్లేస్ ఫిక్స్ చేయండి : బండికి హరీష్ రావు సవాల్

Harish

Minister Harish Rao : రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్న నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చిందని బండి సంజయ్ సవాల్ చేశారని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి 3 లక్షల65 వేల 77 కోట్ల పన్నులు వెళ్లాయని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రు.1 కోటి 68 లక్షల 647 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రు. 7,183 కోట్ల నిధులు కేంద్రం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. వాస్తవాలు మరిచి సంజయ్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. పాలమూరులో పర్యటిస్తున్న సంజయ్ తేదీ చెబితే…పక్కన ఉన్న పొరుగు రాష్ట్రానికి వెళ్లి వద్దామని చెప్పారు. ‘నేను కూడా నీతో పాటు వస్తా…ఇద్దరం వెళ్దామని తెలిపారు. డేట్, టైం నిర్ణయిస్తే….నేను అక్కడికి రావడానికి సిద్ధం’ అని అన్నారు.

రాష్ట్రం చిల్లి గవ్వ ఇవ్వడం లేదని సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారని.. కానీ కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. కేంద్రం రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తన ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనవాయితి అని తెలిపారు. సెస్ ల రూపంలో వసూలు చేస్తూ…..రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోందని విమర్శించారు. 15వ ఆర్ధిక సంఘం కేంద్రాన్ని తప్పు బట్టినా కేంద్రానికి సిగ్గు లేదన్నారు. రాష్ట్రాల హక్కులు కేంద్రం కాలరాస్తోందని పేర్కొన్నారు. బీజేపీ అంటే మాటలెక్కువ… పని తక్కువ చేసే పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.

Harish Rao On Medical College : నిన్న రిజర్వేషన్లు, నేడు మెడికల్ కాలేజీలు.. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు-హరీష్ రావు

ఆర్ధిక నిపుణులు కేంద్రంతో కలిసి పనిచేయలేక పోతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో పెన్షన్ ఎంత ఇస్తున్నారో సంజయ్ అక్కడే అడిగి తెలుసుకుంటే మంచిదన్నారు. పెన్షన్ లలో 3.6 శాతం వాటా మాత్రమే కేంద్ర ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి చొరవ చేసింది కేసీఆర్ అని తెలిపారు. రాయలసీమ నేతలు బాంబులతో తూములు ధ్వంసం చేస్తే…డీకే.అరుణ ఆనాడు పట్టించుకోలేదన్నారు. పోతిరెడ్డి పాడు నీటిని తరలిస్తే ఆమె హారతి ఇచ్చారని గుర్తు చేశారు. ఆమె ఆర్డీఎస్ కు మేలు చేసిందా… కీడు చేసిందా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తి చేశారని పేర్కొన్నారు.

సంజయ్ కు చిత్త శుద్ధి ఉంటే పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు తేవాలని సవాల్ చేశారు. పొరుగు రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇస్తే… తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా ఉన్నప్పుడు ఏముంది? ఇప్పుడు ఏమైందో ఆడిగి తేలుసుకో అన్నారు. గద్వాల్ పాదయాత్రలో మీరు మాట్లాడుతూ అరుణ పరువు తీస్తున్నారని చెప్పారు.  కేంద్రం పేద ప్రజల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. పెట్రోల్ ధరలు కరెంట్ మీటర్ మాదిరిగా తిరుగుతున్నాయని అన్నారు.

Telangana Budget : కేంద్రం వివక్ష చూపిస్తోంది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు

క్రూడ్ ఆయిల్ ధరల పేరుతో కేంద్రం సెస్ లు వేస్తోందని చెప్పారు. సంజయ్ పాదయాత్రలో వాస్తవాలు మాట్లాడితే మంచిదన్నారు. కేంద్రం పెంచిన ధరలు వాస్తవమా కాదా?….వాస్తవం కాకపోతే నేను ముక్కు నేలకు రాస్తానని అన్నారు. కేంద్రం ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతుందని విమర్శించారు. విభజన హామీల గురించి సంజయ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సమైక్య పాలనలో ఏపీ నేతలు మాట్లాడినట్లే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు.