TRS Vs BJP : నాలుగేళ్లు సీఎం అయి ఏం సాధించావు ? శివరాజ్ సింగ్ చౌహాన్‌‌కు హరీష్ సూటి ప్రశ్న

టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణతో‌ రాష్ట్రంతో పోలుస్తారా ? ఎందులో పోలుస్తారు ? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది...

TRS Vs BJP : నాలుగేళ్లు సీఎం అయి ఏం సాధించావు ? శివరాజ్ సింగ్ చౌహాన్‌‌కు హరీష్ సూటి ప్రశ్న

Trs Vs Bjp

Minister Harish Rao Vs CM Shivraj Singh Chouhan : దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ సీఎం అయ్యావు…నాలుగేళ్లు సీఎం అయి ఏం సాధించావు ? అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నిర్వహించిన సభలో టీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో…2022, జనవరి 08వ తేదీ శనివారం సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో ఘనంగా రైతుబంధు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Read More : Female Constable Suicide : తోటి ఉద్యోగి లైంగిక వేధింపులు.. చెరువులో దూకి మహిళా కానిస్టేబుల్ సూసైడ్

తెలంగాణ రాష్ట్రంలో పోలికా ? వ్యాపం స్కాం మాటేమిటి ? :-
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణతో‌ రాష్ట్రంతో పోలుస్తారా ? ఎందులో పోలుస్తారు ? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది అని నిలదీశారు. అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానం చెప్పారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ లో జరిగిన అతిపెద్ద కుంభకోణం (వ్యాపం) సంగతి ఏంటీ ? ఎవరికైనా శిక్ష పడిందా ? ప్రశ్నించారు.

Read More : UP : బీజేపీ జన విశ్వాస్ యాత్ర కాదు..యూపీ అంతా క్షమాపణ యాత్ర చేయాలి : అఖిలేష్ యాదవ్


317 జీవో ఎందుకు రద్దు చేయాలి ? :-
మనుషులనే చంపేశారని, శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ‌సభ్యుల మీద, అక్కడి పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. బీజేపీ నిర్వహించిన సభలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 317 జీవో ఎందుకు రద్దు చేయాలి ? రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా ? అని బీజేపీ నేతలనుద్దేశించి ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా ? నిరుద్యోగులకు ఉద్యోగాలు‌ రావాలని సీఎం కేసీఆర్ భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

Read More : Child Dead : ముక్కు సర్జరీకి వెళ్తే ప్రాణమే పోయింది.. ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణం.. !

తెలంగాణ పథకాలు మధ్యప్రదేశ్ లో ఉన్నాయా ? :-
సీఎం కేసిఆర్ పై చేసే విమర్శ.. సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టుందన్నారు. ఏ రంగంలో కూడ మధ్యప్రదేశ్ తెలంగాణ కు పోటీ కాదని మరోసారి స్పష్టం చేశారాయన. గొప్పగా పాలిస్తే తెలంగాణలో మధ్యప్రదేశ్ కూలీలు ఎందుకుంటారని మరోసారి ప్రశ్నించారు. ఏడేండ్లలో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఉచిత త్రాగునీరు, విద్యుత్, రైతుబంధు, బీమా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయా ? రైతురుణ మాఫీ కోసం మధ్యప్రదేశ్ లో రైతులు ధర్నా చేస్తే ఆరుగురు రైతులను పిట్టల్లా కాల్చి చంపిన నరహంతక చరిత్ర చౌహాన్‌‌దని విమర్శించారు.

Read More : Corona Symptoms : జ్వరం వస్తే కరోనా కాదు.. అసలు లక్షణాలు ఏంటి? వైద్యనిపుణులు ఏమంటున్నారు?

కేంద్రంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి..భర్తీ చేయాలి :-
భౌగోళికంగా పెద్ద రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ GDP కంటే తెలంగాణ GDP ఎక్కువని, తెలంగాణ GDP 9.78 లక్షలుంటే…మధ్యప్రదేశ్ GDP 9.77 గా ఉందని…తలసరి ఆదాయంలో మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణలో సగం కూడ లేదని లెక్కలు చెప్పారు. ఏడాదికి 2 కోట్లు, ఐదేండ్లలో 14 కోట్ల ఉద్యోగాల లెక్క బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పాలన్నారు. కేంద్రంలో 15 లక్షల 62 వేల 962 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, వెంటనే ఈ నియామకాలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆర్మీలో 2 లక్షలు, రైల్వే లో 3 లక్షలు, బ్యాంకులలో 41 వేల ఉద్యోగాలు, విద్యారంగ సంస్థలలో 33 శాతం ఖాళీలు ఉన్నాయని గణాంకాలతో సహా వివరించారు. 2014 ముందు దేశంలో 5 శాతం నిరుద్యోగ రైతు ఉంటే 2021లో 7.9 శాతంకు పెరిగిందన్నారు. తెలంగాణలో 2.2 శాతం మాత్రమే నిరుద్యోగ రేటు ఉందని వివరించారు.

Read More : karimnagar : కరీనంగర్ జిల్లాలో దారుణం : ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

భారతీయ జూటా పార్టీగా మారింది ? :-
తెలంగాణలో మిషన్ భగీరథ రాని గ్రామం ఏదైనా ఉందా….చుక్క నీరు రావడం లేదని నడ్డా విమర్శించడం ఏంటని నిలదీశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో…నడ్డా మాటల్లో నిజం అంతే ఉందని..ప్రజలు నవ్వు కుంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదివితే అభాసు పాలయ్యేది మీరేనని సీఎం శివరాజ్ సింగ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దివాలా కోరు మాటలు, రాజకీయాల కోసం విమర్శలు మానాలని బీజేపీ నేతలకు సూచించారాయన. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్ అనేక సార్లు మిషన్ భగీరథను ప్రశంసించిన విషయాన్ని మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. అసంబద్ధ, అవకాశ వాద, పసలేని ఆరోపణలు చేస్తున్న బీజేపీ పార్టీ భారతీయ జూటా పార్టీగా మారిందన్నారు.