Harish Rao : దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి

దళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి కార్యక్రమం అని, ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు హరీష్ రావు.

Harish Rao : దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి

Harish Rao

Harish Rao : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి తెలంగాణే ఆదర్శం అని మంత్రి హరీష్ రావు అన్నారు. దళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి కార్యక్రమం అని, ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు హరీష్ రావు. సంగారెడ్డి మినీ మీటింగ్ హాల్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్న హరీష్ రావు.. తెలంగాణ బీజేపీ నేతలకు ఇవన్నీ కన్పించవు, గుడ్డిగా విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాక ముందు పదేళ్లలో ఆ నాటి ప్రభుత్వాలు దళితుల కోసం రూ.6,098 కోట్లు ఖర్చు చేస్తే..గడిచిన ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.24వేల 114 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. గతంలో ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 134 ఉంటే నేడు 268 అయ్యాయని చెప్పారు. ఇంటర్ తర్వాత బాలికలు చదువులు మానేస్తున్నారని, తెలంగాణ వచ్చాక 53 ఎస్సీ డిగ్రీ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలను తెచ్చామని, అంతకు ముందు ఒక్కటి కూడా లేదని మంత్రి అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమ్మకానికి పెడుతోందని మండిపడిన హరీష్ రావు.. అదే ప్రభుత్వ రంగ సంస్థలుంటే దళితులకు రిజర్వేషన్లు ఉండేవి కదా…? అని మంత్రి ప్రశ్నించారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రూ.7,280 కోట్లతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నాం అని మంత్రి తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల విద్యను అందివ్వనున్నాం అన్నారు. ఈ పథకాలు అమలైతే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పనికిరాని విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

Coconut : పవిత్రంగా భావించే కొబ్బరితో ప్రయోజనాలు ఎన్నంటే?

బీజేపీ అంటేనే కార్పొరేట్లకు వత్తాసు పలికే పార్టీగా అభివర్ణించారు. సంక్షేమంలో… బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ అన్నింటా ముందుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాక ముందు నాలుగు వైద్య కళాశాలలు ఉంటే, నేడవి 17 కు చేరుకున్నాయన్నారు. కేంద్రం తెలంగాణకు ట్రైబల్ కళాశాల, మైనింగ్ కళాశాల, వాటాగా రావాల్సిన 21 నవోదయ పాఠశాలలను ఎందుకు ఇవ్వదు…? వీటిపై బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనం దాల్చుతున్నారు? అని మంత్రి హరీష్ రావు నిలదీశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని బండి సంజయ్ ను అడిగారు మంత్రి హరీష్ రావు.