Minister Harish Rao: బీజేపీ అంటే భారత జనులను పీడించే పార్టీ.. గల్లీ మీటింగ్‌కువచ్చే బీజేపీ నేతలను తరిమికొట్టాలి.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారమేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో నిర్వహించిన నిరసనలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Minister Harish Rao: బీజేపీ అంటే భారత జనులను పీడించే పార్టీ.. గల్లీ మీటింగ్‌కువచ్చే బీజేపీ నేతలను తరిమికొట్టాలి.

Harish Rao

Minister Harish Rao: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారమేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో నిర్వహించిన నిరసనలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందని, అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ. 350 చొప్పున పెంచడం దారుణమైన చర్య అని హరీష్ రావు అన్నారు. రెండు లక్షల 14వేల కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వం హయాంలో సబ్సిడీ కింద ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వం 37,209 కోట్ల సబ్సిడీ ఇస్తుందంటే ఎంత తగ్గించిందనేది అర్థమవుతుందని అన్నారు.

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

2019లో 37,209 కోట్ల సబ్సిడీ ఉంటే, 2023లో 180 కోట్లకు తగ్గించిందని, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 సబ్సిడీ ఉండేదని, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వాణిజ్య సిలిండర్‌ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి అని తెలిపారు. నాడు గ్యాస్ ధరలు 400 ఉంటే అప్పటి బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారని, స్మృతి ఇరానీ గ్యాస్ బండతో రోడ్ల మీద ధర్నా చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు అదే స్మృతి ఇరాని కేంద్ర మంత్రిగా ఉందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇప్పుడెందుకు ఆందోళన చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకంలో 30వేల కోట్లు కేంద్రం కోత పెట్టిందని, పీఎం కిసాన్ యోజనలో భారీగా లబ్ధిదారులను తొలగించారని, అన్ని సంక్షేమ పథకాలపై కోతలుపెట్టి బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని, ప్రజలంతా ఏకమై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Minister Harish Rao : మెడికో ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశాం : మంత్రి హరీశ్ రావు

ప్రధానమంత్రి ఎందుకు చాయి పే చర్చ పెడుతున్నారని, సిలిండర్ ధరలు పెంచడం వల్ల చాయ్ అమ్ముకునేవారిపై భారం పడ్తలేదా అంటూ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి చాయి బండి కాడ చర్చ పెట్టాలని, 400 సిలిండర్ ఈరోజు 1100 చేశామని చెప్పాలని హరీష్ రావు అన్నారు. ఎన్నిక‌లు అయిపోన ప్రతిసారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచ‌డం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనవాయితీగా మారిందని విమర్శించారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయి, అవి అయిపోగానే మళ్ళీ పెంచుతారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే, భారత జనులను పీడించే పార్టీ.. గల్లీ మీటింగ్‌కి వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలంటూ హరీష్ రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతుందని, బీజేపీ పాలనకు చరమగీతం పాడే రోజులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు.