Minister harish rao: మాన‌వ‌త్వానికి మారు పేరు సీఎం కేసీఆర్

హైదరాబాద్ జంటనగరాల్లో ఉన్న 18ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5కే భోజన సౌకర్యాన్ని ఉస్మానియా ఆస్ప‌త్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు...

Minister harish rao: మాన‌వ‌త్వానికి మారు పేరు సీఎం కేసీఆర్

Harish Rao

Minister harish rao: హైదరాబాద్ జంటనగరాల్లో ఉన్న 18ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5కే భోజన సౌకర్యాన్ని ఉస్మానియా ఆస్ప‌త్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది అని, మానవత్వానికి మారుపేరు అంటూ కొనియాడారు. రాష్ట్రం ఏర్పాటై తెరాస అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే మానవతా దృక్పథంతో పేదలందరికి రూ.1కి కేజీ చొప్పున, ఒక్కొక్కరికి ఆరు కేజీలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. మన రాష్ట్రంలో పండిన పంటని ఇస్తున్నారని, పేదలు కడుపు నిండా తినాలని ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని హరీష్ రావు అన్నారు.

Harish Rao: ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అవసరం లేకున్నా.. ఆపరేషన్‌లు చేస్తున్నారు – హరీష్ రావు

హాస్టల్స్ లో పిల్లలకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆసరా పెన్షన్ 200 ఉన్న దాన్ని 2,016 రూపాయల పెన్షన్, కల్యాణ లక్ష్మీ ద్వారా ఆడపిల్ల పెళ్లిళ్లకు లక్షా 116 రూపాయలు, వికలాంగులకు 3వేల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. తాజాగా హైదరాబాద్ జంటనగరాల్లో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ. 5కు మూడు పూటల భోజనం ప్రారంభించామన్నారు. ఇందుకుగాను రూ. 40కోట్లు ప్రభుత్వం మీద భారం పడనుందని హరీష్ రావు తెలిపారు. ఒక వేళ ఖ‌ర్చు పెరిగినా కూడా ప్ర‌భుత్వం భోజ‌నం పెట్టేందుకు వెనుకాడ‌ద‌ని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. హరే కృష్ణ వారి సహకారంతో భోజనం ప్రారంభించామని, వారికి రూ.21లు ప్రతి పూటకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. వీటితో పాటు నైట్ షల్టర్లు త్వరలో ప్రారంభిస్తామని హరీష్ రావు తెలిపారు.