Harish Rao On Jobs : త్వరలో మరో 3వేల ఉద్యోగాలు భర్తీ-హరీశ్ రావు

చాలారకాల ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇచ్చామని తెలిపారు. పిల్లలకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Harish Rao On Jobs : త్వరలో మరో 3వేల ఉద్యోగాలు భర్తీ-హరీశ్ రావు

Harish Rao On Jobs

Harish Rao On Jobs : సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు ఉచిత పోలీస్ శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్ధిపేట అన్నింటిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. చాలారకాల ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇచ్చామని ఆయన తెలిపారు. పిల్లలకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రూప్స్ కు కూడా సిద్ధిపేటలో ఫ్రీ కోచింగ్ ఇస్తాన్నారు. మరో 3వేల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

కేంద్రంలో 3 లక్షలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఈ ఫ్రీ కోచింగ్ వాటికి కూడా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. అప్లికేషన్ ఎలా భర్తీ చేయాలనే దానిపైనా ట్రైనింగ్ ఇస్తామన్నారు. జాబ్ వస్తుందా? రాదా? అనే అనుమానం వదిలిపెట్టి… కచ్చితంగా రావాలి అనే లక్ష్యంతో చదవాలని విద్యార్థులకు మంత్రి హరీశ్ రావు సూచించారు.

Warangal : కోచింగ్ సెంటర్లు కళకళ.. వరంగల్‌‌కు నిరుద్యోగుల క్యూ

కోటి రూపాయల ఖర్చుతో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామని, ఒక్కొక్కరి మీద రూ.13 వేలు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరో 3 చోట్ల కోచింగ్ ఇస్తామన్నారు. రాజగోపాల్ పేట్, మహతి ఆడిటోరియం గజ్వేల్, బాబూ జగ్జీవన్ రామ్ భవనాల్లో కోచింగ్ ఇస్తామన్నారు. అభ్యర్థులు కొన్ని రోజులు సోషల్ మీడియాను వదిలిపెట్టి ఇష్టంతో చదివితే తప్పకుండా జాబ్ వస్తుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అధికారులు మీకు కోచింగ్ లో సాయం చేస్తారని తెలిపారు. డిగ్రీ ఫైనల్ విద్యార్థులకు మూడేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం 95శాతం ఉద్యోగాలు లోకల్స్ కు ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

జాబ్ కావాలంటే.. 2 నెలలు ఫోన్లు వాడొద్దు..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కీలక సూచన చేశారు మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కష్టపడి చదవాలన్నారు. సిద్ధిపేటలో టెట్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్.. హైదరాబాద్, అవనిగడ్డ కంటే బెస్ట్ కోచింగ్ ఇక్కడ ఇచ్చేలా ప్లాన్ చేశామన్నారు. గతంలో 1000 మంది కోచింగ్ తీసుకుంటే 800 మంది అర్హత సాధించారని ఆయన గుర్తు చేవారు. కాగా, ఈ రెండు నెలలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు హరీశ్ రావు.