Omicron : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటాం-మంత్రి హరీష్‌రావు

కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన ఓల్డ్‌బోయినపల్లి‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.

Omicron : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటాం-మంత్రి హరీష్‌రావు

Harish Rao

Omicron :  కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన ఓల్డ్‌బోయినపల్లి‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని… ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వస్తోందని …ఎవరూ భయపడవద్దని చెప్పారు.  ప్రభుత్వం ఆధ్వర్యంలో 27 వేల పడకలు సిధ్ధంగా ఉన్నట్లు హరీష్ రావు చెప్పారు.

ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో ఇంకా 900 మంది వ్యాక్సిన్ వేయించుకోలేదని అందరికీ టీకాలు వేయించే బాధ్యత బస్తీ పెద్దలు తీసుకోవాలని అన్నారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదటి డోసు టీకాను 91 శాతం మంది వేయించుకున్నారని… వ్యాక్సిన్ వేయించుకుంటే కోవిడ్ వచ్చినా అది  మనల్ని కాపాడుతుందని ఆయన అన్నారు. మేమందరం వ్యాక్సిన్ వేయించుకున్నామని వేయించుకోని వాళ్లు వెంటనే వేయించుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని బస్తీ ప్రజలకు పిలుపు నిచ్చారు.

Also Read : Delhi Air Pollution : ఢిల్లీ వాయు కాలుష్యం-ఆస్పత్రుల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి

దేశంలో మరెక్కడాలేని విధంగా రాష్ట్రంలో బస్తీ దావాఖానాలు ప్రారంభించామని…. అవి ఇప్పడు దోస్తీ దవాఖానాలుగా   పేరు తెచ్చుకున్నాయని అన్నారు. ఇవాళ్ల ఒక్కరోజే హైదరాబాద్ లో మొత్తం 32 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నామని… మరో 92 దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.ఇతర జిల్లాల్లో కూడా బస్తి దవాఖానాలు కావాలనే డిమాండ్ వస్తోందని… దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బస్తి దవాఖానలు ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.

ప్రజలు వేలకు వేలుఖర్చు పెడుతూ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళవద్దని….. అన్నిరకాల వైద్య పరీక్షలు T డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా పరీక్షలు చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. బస్తీ దవాఖానాలలో  ప్రభుత్వం మందులు ఇవ్వడంతో పాటు అన్ని రకాల టెస్ట్ లు చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు.

హైదరాబాద్ 4దిక్కుల అత్యాధువిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నాలుగింటిని ఏర్పాటు చేయబోతున్నట్లు హరీష్ రావు చెప్పారు. వీటిలో 4వేల పడకలతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి పేద,మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 258 బస్తీ దవాఖానాలలో  రోజుకి 100 మందికి తగ్గకుండా ప్రజలు వివిధ రోగాలకు సేవలు పొందుతున్నారని హరీష్ రావు వివరించారు.