Health Women Centers : తెలంగాణలో మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకం వచ్చింది. మహిళల ఆరోగ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

Health Women Centers : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకం వచ్చింది. మహిళల ఆరోగ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆరోగ్య మహిళా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించాలని ప్రభతుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి సెంటర్ ను కరీంనగర్ లో మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకే వైద్య సేవలు అందిస్తారని చెప్పారు.

వంద ఆస్పత్రుల సంఖ్యను మెల్ల మెల్లగా పెంచుతామని మంత్రి తెలిపారు. ఈ సెంటర్ లో అందరూ మహిళలే ఉంటారని పేర్కొన్నారు. డాక్టరు, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎమ్, ల్యాబ్ టెక్నీషియన్ తోపాటు మిగతా ఆస్పత్రి సిబ్బంది అందరూ మహిళలే ఉంటారని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో అందరూ ఆడవాళ్లే ఉంటారు కాబట్టి మహిళలు ధైర్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాల దగ్గరకు రావొచ్చని చెప్పారు. మహిళలు వారి ఇబ్బందులను స్వేచ్ఛగా డాక్టర్లకు చెప్పుకోవచ్చన్నారు.

CM KCR : తెలంగాణలో మరో కొత్త పథకం, ఇక చేనేత కార్మికులకు కూడా

ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే చూస్తారని.. పురుషులకు చూడరని తేల్చి చెప్పారు. ప్రతి మంగళవారం ఈ వంద ఆస్పత్రుల్లో మహిళల కోసం ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన మహిళలకు డాక్టర్లు వైద్యం, పరీక్షలు, అవసరమైన మందులను కూడా ఉచితంగా ఇక్కడే ఇస్తారని చెప్పారు. ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఏవైతే వైద్య సేవలు లభిస్తాయో ఆ సేవలన్నీ ఇక్కడ మహిళలకు అందిస్తారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు