Minister Harish Rao: వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు.. మొదటి స్థానంలో నిలవాలి

గతంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏమి చేయలేకపోయాయి. 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు వస్తే, తెలంగాణ వచ్చాక తొమ్మిదేళ్లలో తొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చాయి.

Minister Harish Rao: వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు.. మొదటి స్థానంలో నిలవాలి

Minister Harish Rao

Minister Harish Rao: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది. మందులతో రోగాన్ని నయం చేయవచ్చు, కానీ రోగితో ప్రేమగా మాట్లాడితే సగం రోగం తగ్గిపోతుంది. వైద్యులుకూడా మీ వద్దకు వచ్చిన రోగిని మీ కుటుంబ సభ్యుల్లా భావించి వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.  శిల్పకళావేదికలో నూతనంగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీష్ రావు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణలో వైద్య సిబ్బందిని పెద్ద ఎత్తున నియామకాలను చేపడుతున్నాం. ఒకేసారి 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నియమించుకుంటున్నాము. దేశంలోనే ఇది మొట్టమొదటిసారి అని హరీష్ రావు అన్నారు.

Bandi Sanjay: బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం.. కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పడకపోతే, సీఎంగా కేసీఆర్ ఉండకపోతే రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చేవి కావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుందని అన్నారు. తొమ్మిదేళ్లుగా 22,263 మందికి హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలు కల్పించాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 31, 484 మందికి హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలిచ్చాం. కొంత మంది కల్లుండి, చెవులుండి.. ఇది చూడలేక పోతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై హరీష్ రావు మండిపడ్డారు.  ఒక్కో వైద్య విద్యార్థి మీద ప్రభుత్వం1కోటి రూపాయలు ఖర్చు చేస్తోంది. అన్నీ వృత్తులకంటే వైద్య వృత్తి పవిత్రమైంది. దేశాన్ని కాపాడే సైనికులు, అన్నంపెట్టె రైతులు, ప్రాణాలు కాపాడే వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని అన్నారు.

YCP MLA Perni nani : రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ప్రకటన

తెలంగాణ ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా ఇల్లు కట్టిస్తున్నామని, పేదల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తున్నామని, పేదలకు సీఎం కేసీఆర్ ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని మంత్రి చెప్పారు. భారత దేశంలోని అత్యధిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్ మన హైదరాబాద్‌లో జరుగుతున్నాయని చెప్పారు. ప్రతినెల 11న వైద్యులతో మాట్లాడతా. కార్పొరేట్ వైద్యంతో పోటీ పడి పనిచేద్దాం.  దేశంలో వైద్య రంగంలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపి సీఎం కేసీఆర్ కలలను నిజంచేద్దాం అని హరీష్ రావు అన్నారు. వచ్చే నెల నుంచి 134 పరీక్షలను టీ డియాగ్నోస్ ద్వారా ఉచితంగా చేస్తామని చెప్పారు.

Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్ సవాల్‌కు మేం సిద్ధం.. అలా అయితేనే అంటూ షరతు పెట్టిన రెజ్లర్లు

గతంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏమి చేయలేకపోయాయి. 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు వస్తే, తెలంగాణ వచ్చాక తొమ్మిదేళ్లలో తొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడక ముందు 2900 మెడికల్ సీట్లు ఉంటే, ప్రస్తుతం 8500 సీట్లకు పెంచాం. ఒక్క ఎయిమ్స్ కాలేజ్‌కి శంకుస్థాపన చేయడానికి పీఎం మోడీ అంత హంగామా చేశారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు అన్నారు. 10వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రభుత్వం అబాటులోకి తేబోతున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు 17000 వేల బెడ్స్ ఉంటే ప్రస్తుతం 34000 బెడ్స్, రాబోవు రోజుల్లో 50వేల బెడ్స్‌కు చేరుకోబోతున్నామని హరీష్ రావు అన్నారు.